జయప్రదకు చిర్రెత్తింది: చెంప చెళ్లుమనిపిస్తానని..

జర్నలిస్టుపై ఆమెకు ఎక్కడలేని కోపం వచ్చి, "ఏం ప్రశ్న అడుగుతున్నారు? బుద్ధి ఉందా, లాగిపెట్టి ఒక్కటిస్తాను జాగ్రత్త'' అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన జయప్రద గతంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ.
అమర్‌సింగ్‌తో పాటు ఆమెనూ సమాజ్‌వాదీ నుంచి గతంలోనే బహిష్కరించారు. అలాంటి పార్టీ గురించి అడగడమే ఆమె ఆగ్రహానికి కారణమైంది. సమాజ్‌వాదీ పార్టీ నుంచి నన్ను నెట్టేశారు, ఆ మాత్రం తెలియదా అని ఆమె జర్నలిస్టుపై రుసరుసలాడింది. హత్యకు గురైన డిఎస్పీ భార్యను పరామర్శించడానికి జయప్రద వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది.
హత్యకు గురైన డిఎస్పీ జియా ఉల్ హక్ భార్య ప్రవీణ్ ఆజాద్‌ను ఆమె పరామర్శించారు. హక్ మార్చి 2వ తేదీన హత్యకు గురయ్యారు.












Click it and Unblock the Notifications