టిపై అత్యాచారం!: జయప్రద నోట ఎన్టీఆర్ పాట

పార్లమెంటు ఉభయ సభలను విభజన అంశం కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నిన్న కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్.. మహిళలపై అత్యాచారాలు ఏ విధంగా జరుగుతున్నాయో, తెలంగాణ ప్రజలపై కూడా సీమాంధ్రులు అత్యాచారాలు జరుపుతున్నారని, తమను బలవంతంగా కలిసి ఉండాలని కోరుతున్నారని జయప్రదనుద్దేశించి అన్నారు.
అందుకు జయప్రద ఆయనకు సమాధానం ఇచ్చారు. తెలుగువారంతా కలిసిమెలిసి సోదరుల్లా ఉండాలనడంలో తప్పేమిటని ప్రశ్నించారు. ఆ తర్వాత వెంటనే తెలుగు జాతి మనది... అంటూ ఎన్టీఆర్ పాడిన పాటను ఆమె పాడి వినిపించారు. అందరం కలిసి ఉందామని అభిప్రాయపడ్డారు.
కాగా, వారం రోజుల క్రితమే విభజనపై జయప్రద ఆంటోని కమిటీ ముందు పెదవి విప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గత వారం ఆంటోని కమిటీని కలిసిన ఆమె విభజనపై తన అభిప్రాయాన్ని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, విభజన అనివార్యమైతే మాత్రం హైదరాబాదును రెండు రాష్ట్రాలకు శాశ్వత రాజధానిగా ఉంచాలని కోరారు.












Click it and Unblock the Notifications