'టి' మైండ్‌గేమ్: అవునంటామా, కాదా?(పిక్చర్స్)

తెలంగాణపై నిర్ణయం వెలువడే అవకాశాలున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో తద్వారా వచ్చే సాధారణ ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణపై త్వరలో నిర్ణయం ఉంటుందని గత నెలలోనే రాష్ట్రానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఆ తర్వాత పలువురు కేంద్రమంత్రులు తేల్చేస్తామన్నారు.

అయితే ఇన్నాళ్లుగా అంతగా స్పందించని వారు తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజీనామాల వరకు వెళ్లారు. చూస్తుంటే.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణపై ఆశలు వదిలేసుకొని, సీమాంధ్రలో మరింత పట్టు కోసం చూస్తున్నట్లుగా కనిపిస్తోందని, 2009లో మాట జారిన ఫలితం ఇప్పటి వరకు అనుభవిస్తున్నామనే ఆందోళనలో తెలుగుదేశం పార్టీ మౌనం వహిస్తోందని, ఇక తమ తమ ప్రాంతాల్లో పార్టీని నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెసు పార్టీ ఇరు ప్రాంతాల నేతలు పోటా పోటీ భేటీలు నిర్వహిస్తున్నారు.

రాజీనామాల పర్వం

రాజీనామాల పర్వం

రాష్ట్ర విభజనపై జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు పలువురు రాజీనామాలు చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మినహా ఆ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు, నలుగురు కాంగ్రెసు ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. పంచాయతీ తద్వారా సాధారణ ఎన్నికల్లో లబ్ధి పొందే వ్యూహం కోసమే ఇలా చేస్తున్నారని అంటున్నారు. టిడిపి మౌనం ఇరు ప్రాంతాల్లో పట్టు కోల్పోకుండా ఉండేందుకని చెబుతున్నారు.

కాంగ్రెస్‌లో పోటా పోటీ

కాంగ్రెస్‌లో పోటా పోటీ

విభజన వేడి కాంగ్రెసు పార్టీలోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇరు ప్రాంతాల మంత్రులు పోటా పోటీగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఇతర నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి రాజీనామా చేసి కాకరేపారు.

ధీటుగా వైయస్సార్ కాంగ్రెస్

ధీటుగా వైయస్సార్ కాంగ్రెస్

సీమాంధ్ర కాంగ్రెసు నేతలు సమైక్య గళం గట్టిగా వినిపిస్తుండటంతో మేల్కొన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధీటుగా స్పందించింది. ఆ పార్టీకి చెందిన పదహారు మంది శాసన సభ్యులు రాజీనామా చేశారు. సమైక్యాంధ్రలో తమ బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

చంద్రబాబు వ్యూహాత్మక మౌనం

చంద్రబాబు వ్యూహాత్మక మౌనం

రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది. రెండు ప్రాంతాల్లో పార్టీ పుంజుకొనే దశలో ఉండటంతో ఆచితూచి వ్యవహరించాలన్నది ఆ పార్టీ అధినాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై ఉభయ ప్రాంతాల నేతలు ఎవరూ ఏ స్పందనా వ్యక్తం చేయకుండా వేచి చూడాలని చంద్రబాబు గట్టిగా చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పటికే రాజీనామాల ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు జగన్‌కు చిక్కులుతేగా, ఏదో నిర్ణయం వెలువడ్డాక బాబుకు చిక్కులు తప్పవు!

కావూరి సాంబశివ రావు

కావూరి సాంబశివ రావు

సమైక్యవాదిగా ముద్రపడిన కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు యూ టర్న్ తీసుకున్న తర్వాత తెలంగాణపై ఆచితూచి స్పందిస్తున్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన ఆయన గురువారం రాజీనామాలపై మాట్లాడుతూ... నా అభిప్రాయం ఏముందని, వాళ్లు చేస్తానంటే నేను కాదంటానా? అవునంటానా? అని వ్యాఖ్యానించారు.

సీమాంధ్ర కాంగ్రెసు నేతల భేటీలపై తెలంగాణ కాంగ్రెసు నేతలు మండిపడుతుండగా, ఇడుపులపాయ తీర్మానానికి తమ పార్టీకి చెందిన నేతలు కట్టుబడి ఉండాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రాంత నేతలు రాజీనామాలపై స్పందిస్తూ చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో మాత్రం ఇరువైపుల నేతలు అధినేత నారా చంద్రబాబు నాయుడు హుకూం మేరకు మౌనం వహిస్తున్నారు. అయితే తెలంగాణపై ఓ నిర్ణయం వచ్చాక మాత్రం వ్యతిరేకంగా వచ్చిన ప్రాంత నేతలు ధీటుగా స్పందించే అవకాశముంది. అది బాబుకు ఇబ్బంది తెచ్చేదే అంటున్నారు.

ఈ నేపథ్యంలో సమైక్యాంధర్ కోసం రాజీనామాలపై కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు స్పందిస్తూ.. తాను చెప్పేదేముందని, వాళ్లు రాజీనామా చేస్తానంటే కాదంటానా? అవునంటానా? అని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తెలంగాణ, సమైక్యవాద ఉద్యమాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేతల పరిస్థితి కూడా అలాగే ఉందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+