జగన్‌కోసం నాగార్జున శివమణి సంతకం, 98480..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదలను కోరుతూ 'శివమణి' సంతకం చేశారట! అక్రమాస్తుల కేసులో అరెస్టై ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్ విడుదల కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇటీవల కోటి 96 లక్షల సంతకాలను సేకరించిన విషయం తెలిసిందే. ఆ సంతకాలపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సహా పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.
అందులో దొంగ సంతకాలు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. ఎవరి మాట ఎలా ఉన్నా జగన్ కోసం సంతకం చేసిన వారిలో 'శివమణి' కూడా ఉన్నారట. యువసామ్రాట్ నాగార్జున హీరోగా, పూరి జగన్నాథ్ దర్సకత్వంలో శివమణి చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో నాగార్జున ఫోన్ నెంబర్ 98480 22338. అదే పేరుతో, అదే నెంబరుతో జగన్ కోసం జనం సంతకాలలిస్టులో ఉంది.

శివమణి అని ఆంగ్ల అక్షరాలలో ఉంది. ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఉంది. ఆ తర్వాత సంతకం ఉంది. జగన్ కోసం చేసిన సంతకాలలో శివమణి పేరు ఉండటం వరకు ఓకే అయినప్పటికీ ఫోన్ నెంబర్ నాగార్జున సినిమాలోది కావడంతో ఆ సంతకంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున నిజ జీవితంలోకి శివమణి రూపంలో వచ్చి సంతకం చేశారా? అంటూ విసుర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది ఫేస్‌బుక్‌లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.












Click it and Unblock the Notifications