వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిపై మీడియాను పరుగెత్తించారు: ఆజాద్ పిల్లిమొగ్గ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana row: Azad silence
కేంద్రమంత్రి, కాంగ్రెసు పార్టీ రాష్ట్ర మాజీ ఇంఛార్జి గులాం నబీ ఆజాద్ ఆదివారం పిల్లిమొగ్గ వేశారు. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత, శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీ భాగస్వామి అయ్యారు. ఆజాద్ మీడియాను పరుగులు పెట్టించారు. తెలంగాణ గురించి వాడిగా వేడిగా చర్చ సాగుతున్న సమయంలో విలేకరుల సమావేశం పేరిట హడావుడి చేసి చివరికి ఉసూరుమనిపించారు. తెలంగాణపై జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో చీమ చిటుక్కుమన్నా మీడియా ఉరుకులు, పరుగులు పెడుతోంది.

ఈ నేపథ్యంలోనే, ఆదివారం ఉదయం ఆజాద్ మాట్లాడతారంటూ మీడియా ప్రతినిధులకు ఫోన్లు వచ్చాయి. అవి కూడా, ఒక తెలుగు మీడియా చానల్‌కు చెందిన రిపోర్టర్ల నుంచి కావడం విశేషం. దీంతో, ఢిల్లీ, హైదరాబాద్‌ల్లో ఉన్న మీడియా సిబ్బంది మొత్తం అలర్ట్ అయ్యారు. ఓబీ వ్యాన్లు, లైవ్ కిట్లతో సహా ఆజాద్ నివాసం వద్ద దిగిపోయారు. దాదాపు రెండు గంటల వరకు ఎదురు చూశారు. ఈ హడావుడి చూసి ఆజాద్ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆజాద్ అసలు ఢిల్లీలోనే లేరని చెప్పుకొచ్చారు.

మరికొద్దిసేపటికి షబ్బీర్ అలీ.. ఆజాద్ నివాసంలో ఉన్నట్లు బయటకు పొక్కింది. ఆజాద్ బయటకు రాక పోగా ఆజాద్ వ్యక్తిగత సిబ్బంది వచ్చి మీడియాతో మాట్లాడే ఉద్దేశం సార్‌కు లేదని, అసలు మీడియా ప్రతినిధులు ఎవరినీ తాము పిలవలేదని స్పష్టం చేశారు. అదే సమయంలో అప్పటి వరకు ఆజాద్ ఇంట్లోనే ఉన్న షబ్బీర్ అలీ మీడియా కంట పడకుండా వెళ్లిపోయారట.

కాగా, మీడియా ప్రతినిధులు అసలు ఫోన్లు ఎవరు చేశారని ఆరా తీశారు. ఆ క్రమంలో తెలిసిందేమిటంటే కొద్ది రోజుల కిందట రాయల తెలంగాణకు ఆజాద్ మద్దతు కూడగడుతున్నారంటూ కొన్ని పత్రికలు, చానళ్లు కథనాలు ఇచ్చాయి. దీనిపై కొందరు కాంగ్రెస్ నాయకులే ఆజాద్‌ను నిలదీసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే, ఆదివారం ఆజాద్ నివాసానికి వచ్చిన షబ్బీర్ రెండు గంటలకు పైగా ఆయనతో చర్చలు జరిపారు.

ఆ సందర్భంగా రాయల తెలంగాణ అంశంపై వివరణ ఇస్తే బాగుంటుందని ఆజాద్‌కు షబ్బీర్ సూచించారట. దీంతో అందరికీ సమాచారం చేరింది. ఇదంతా చూసిన కాంగ్రెస్ నాయకులు కొంతమంది అప్పటికప్పుడు ఆజాద్‌ను ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడు మీడియాతో మాట్లాడితే తాను చెప్పాలనుకున్న వివరణ కంటే వివాదమే ఎక్కువ అవుతుందని గ్రహించిన ఆజాద్ వెనక్కు తగ్గారట.

English summary
Central Minister and Former AP Congress Incharge Ghulam Nabi Azad is keeping silence over Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X