సాయిరెడ్డి: వైయస్ చెప్పారు, చిద్దూ నియమించారు

వైయస్ రాజశేఖర రెడ్డి విజయసాయి రెడ్డి పేరును సిఫార్సు చేశారని, కేంద్ర మంత్రి చిదంబరం అనుగ్రహించారని అంటున్నారు. దాంతో విజయసాయిరెడ్డి ఆ పదవిలో ఇమిడిపోయారని చెబుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే విజయసాయి రెడ్డి ఒబిసి డైరెక్టర్‌గా వ్యవహరించారు. తిరుమల తిరుపతి పాలకమండలి (టిటిడి) సభ్యుడిగా పనిచేశారు. ఇదంతా వైయస్ చలువ కాకపోతే మరేమిటీ...
జగన్ అక్రమాస్తుల కేసులో సోమవారం సిబిఐతన రెండో చార్జిషీటుకు అనుబంధంగా మరో చార్జిషీటు దాఖలు చేసింది. అందులో వైయస్ రాజశేఖర రెడ్డి, విజయ సాయిరెడ్డికి మధ్య సంబంధాన్ని వివరించింది. అందుకు ఆధారంగా అప్పట్లో సాయిరెడ్డి కోసం వైయస్ రాసిన సిఫారసు లేఖను జతపరిచింది. 'సాయిరెడ్డి బ్యాంకింగ్‌లో నిపుణుడు. ఆయనను తగిన విధంగా గుర్తించాలి' అని వైయస్ రాజశేఖర రెడ్డి తన లేఖలో చిదంబరానికి సూచించారు.
విజయ సాయిరెడ్డి డైరెక్టర్‌గా ఉన్నప్పుడే ఒబిసి సహా వివిధ బ్యాంకుల నుంచి జగన్ సంస్థలకు రూ. 200 కోట్ల రుణం మంజూరైంది. వీటితో పాటు పలు కీలక విషయాలతో సిబిఐ అనుబంధ చార్జిషీటు రూపొందించింది. ఇందులో పది మందిని సాక్షులుగా చేర్చింది.












Click it and Unblock the Notifications