బొత్సతో వైయస్ వివేకా భేటీ: తీగ లాగితే...?

ఆ భేటీలో మంత్రి పార్థసారథి కూడా పాల్గొన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి - వైయస్సార్ కాంగ్రెస్ నేత, జగన్ చిన్నాయన వైఎస్ వివేకానందరెడ్డి బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసానికి వెళ్లారు. కొద్దిసేపు ఆయన కోసం వేచిచూశారు. కొద్ది సెకన్ల తర్వాత అక్కడికి మంత్రి పార్ధసారధి కూడా బొత్సతో కలసి వచ్చారు. ఆ తర్వాత వారంతా కలసి భోజనం చేశారు. గంటన్నరసేపు మంతనాలు జరిపారు.
బయట ప్రచారంలోకి వచ్చిన విషయం ఏమిటంటే - హరిశ్చంద్రప్రసాద్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని వైయస్ వివేకానంద రెడ్డి బొత్స వద్దకు తీసుకువెళ్లారు. సదరు హరిశ్చంద్రప్రసాద్ అనే నాయకుడు ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో హైదరాబాద్ నగర శివార్లలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. అప్పుడు కూడా వివేకానందరెడ్డి చొరవ తీసుకుని సోదరుడు ఆయనను వైయస్ వద్దకు తీసుకువెళ్లారు.
ఇప్పుడు మళ్లీ హరిశ్చంద్రప్రసాద్‌కు తాను విడిచిపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీటు ఇప్పించేందుకు వివేకా నడుం బిగించినట్లు చెబుతున్నారు. దానికోసం బొత్సతో తనకున్న స్నేహాన్ని వివేకానంద రెడ్డి వినియోగించుకున్నారు. వివేకా సిఫారసు చేసిన హరిశ్చంద్రప్రసాద్‌కు ఎమ్మెల్సీ సీటు ఇప్పించేలా తాను ఢిల్లీ స్థాయిలో ప్రయత్నిస్తానని, మీరు కూడా ఢిల్లీలో ప్రయత్నించుకోవాలని సలహా ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications