సురేష్ రైనాగా రామ్ చరణ్ తేజ: ధోనీపై సినిమా
ముంబై: తెలుగు సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై నిర్మిస్తున్న హిందీ సినిమాలో రామ్ చరణ్ తేజ నటించబోతున్నాడు. పొట్టి క్రికెట్ హీరో సురేష్ రైనా పాత్రలో ఆయన కనిపిస్తాడట. ఎంఎస్ ధోనీ - ది అన్ టోల్డ్ స్టోరీ పేర ధోనీపై సినిమా నిర్మితమవుతోంది.
ధోనీ పాత్రలో సుశాంత్ రాజ్‌పుత్ నటిస్తాడట. రవీంద్ర జడేడాగా అమిత్ కుమార్, మైఖేల్ క్లార్క్‌గా మహ్మద్ యూసుఫ్ నటిస్తున్నారు. నీరజ్ పాండే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నీరజ్ పాండే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 2015లో సినిమా విడుదలవుతుందని అంటున్నారు.

క్రీడాకారుల జీవితాలపై పాన్ సింగ్ తోమర్, భాగ్ మిల్కా భాగ్, మేరీ కోమ్ సినిమాల వరుసలో ధోనీ సినిమా రానుంది. ధోనీపై సినిమా వస్తున్న విషయాన్ని ఆయన సతీమణి సాక్షి ట్విట్టర్‌లో ధ్రువీకరించింది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సాధించిన విజయాలపైనే కాకుండా క్రికెట్ హీరోగా ఎదగడానికి ముందు పడిన శ్రమపై కూడా సినిమా దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు
ప్రస్తుతం నీరజ్ పాండే అక్షయ్ కుమార్‌తో బాబీ సినిమా చేస్తున్నారు. ఇది విశిష్టమైన వ్చక్తి, నాయకుడు, ఇంటర్నేషనల్ ఐకాన్ విశిష్టమైన ప్రయాణమని నీరజ్ పాండే ధోనీ సినిమాపై వ్యాఖ్యానించారు. ధోనీ పాత్ర పోషించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని సుశాంత్ రాజ్‌పుత్ అన్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications