ముంబై మోడల్: తాగించాడు, దోచుకున్నాడు
హైదరాబాద్: హైదరాబాదుకు ముంబై మోడల్స్‌కు ఏదో విడదీయరాని లింక్ ఉన్నట్లుంది. హైదరాబాదులో ముంబై మోడల్స్ ఎప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నారు. తాజాగా సినిమా అవకాశం మోజులో పడి దోపిడీకి గురైన ముంబై మోడల్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాదు గోపాలపురం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
సినిమా అవకాశం ఇప్పిస్తానని హైదరాబాదుకు రప్పించి మత్తు మందు ఇచ్చి ముంబై మోడల్ ఆభరణాలను ఓ యువకుడు దోచుకున్నాడు. ముంబైకి చెందిన మోడల్ సుబ్రతా దత్తా (25)కు నెట్ ద్వారా సికింద్రాబాద్ కార్ఖానాకు చెందిన రాజు పరిచయమయ్యాడు.

యువకుడి మాటలు నమ్మి ఆమె పూణే నుంచి సికింద్రాబాదుకు వచ్చింది. కార్ఖానాలోని తన నివాసంలో ఆమెకు అతను రెండు రోజులు ఆశ్రయమిచ్చాడు. నిత్య మద్యం తాగుతూ ఆమెతో కూడా తాగించాడు. గురువారంనాడు బ్యూటీ పార్లర్‌కు తీసుకుని వెళ్లి కారులో వస్తుండగానే ఆమెకు మద్యం ఇచ్చాడు. అందులో మత్తు మందు కలిపాడు. దాంతో ఆమె స్పృహ తప్పింది.
ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలను తీసుకుని రాజు ఆమెను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వదిలేసి పోయాడు. కొద్ది గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన మోడల్ రాజుపై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications