వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేరు, బొమ్మ అదే..: రజనీకాంత్ పుట్టిన రోజున ఫ్యాన్స్ కొత్త పార్టీ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు కొందరు కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తమిళనాట ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారు రజనీకాంత్ ఫోటో, రజనీకాంత్ పేరు వచ్చేలా పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తమిళనాడులోని పలు జిల్లాలకు చెందిన అభిమానులు ఈ దిశలో కసరత్తు చేస్తున్నారని అంటున్నారు.

రజనీకాంత్ ఫ్యాన్స్ పార్టీ పెడతారనే ఊహాగానాలు వినిపించడంతో దీనిపై జోరుగా చర్చ సాగుతోంది. డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టిన రోజు. ఆ రోజున కొత్త పార్టీని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కాగా, రజనీకాంత్ సినిమాల్లోకి రావాలని దశాబ్దాలుగా అభిమానులు కోరుతున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ పార్టీ పెట్టాలని, ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకునే వారు తమిళనాడులో చాలామంది ఉన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తమ పార్టీలోకి తీసుకోవాలని ఉబలాటపడే పార్టీలు ఉన్నాయి.

Rajini fans gearing to start new political party

కాగా, తమిళ రాజకీయ నేతలంతా అవకాశవాదులు, రజనీ రాజకీయాల్లో ఇమడలేడని, ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా లేదని, అభిమానులు ఆయనపై ఒత్తిడి తీసుకురావద్దని రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.

తిరుచ్చి జిల్లా అరియమంగళంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తన సోదరుడు రజనీ నటించిన ‘లింగ' చిత్రం భారీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కావేరీ నదీజలాలపై ఇరు ప్రభుత్వాలు వివాదాలు సృష్టించుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

కర్నాటక ప్రభుత్వం రిజర్వాయర్‌లు నిర్మించుకున్నా, తమిళనాడు ప్రజలకు నీరు ఇవ్వాల్సిందేనన్నారు. రిజర్వాయర్‌ల నిర్మాణాలు జరిగితే ఇరు రాష్ట్రాలు లబ్ధి పొందుతారని వెల్లడించారు. రజనీ రాజకీయాల్లోకి రారని సత్యనారాయణ స్పష్టం చేశారు. రాజకీయం అంటేనే మోసమని, రాజకీయ నేతల మనస్తత్వం సందర్భానుసారంగా అవకాశవాదుల్లా మారుతుందన్నారు.

అలాంటి వారి మధ్య రజనీ ఇమడలేరని, ఆయన్ని రాజకీయాల్లోకి రావాలంటూ ఒత్తిడి చేయవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. రజనీ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు తిరుచ్చి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్న వెండి రథం పనులను సత్యనారాయణ పరిశీలించారు.

ఈ సందర్భంగా రజనీ అభిమానులకు ఆయన అభినందనలు తెలిపారు. తాను రాజకీయాల్లోకి వచ్చేది రానిదీ దైవం మీద ఆధారపడి ఉందని రజనీకాంత్ అప్పట్లో చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చే విషయంపై ఎటూ తేల్చడం లేదు. దీంతో ఎప్పటికప్పుడు ఆ విషయంపై చర్స సాగుతూనే ఉన్నది.

English summary
A section of Rajini fans gearing to start new political party on Rajinikanth's birthday Dec 12.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X