ఒక మహిళతో విడిపోయి: మరొకరితో సహజీవనం?

హైదరాబాద్: ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు నేత ఉసెండీ వివాహం వివాదంగా మారింది. ఊసెండి మూడో పెళ్లిపై మావోయిస్టు ప్రకటన వివాదానికి తెర తీసింది. భార్య రాజీ ఉండగానే ఊసెండి అలియాస్ గుమ్మడివెల్లి వెంకటకిషన్ ప్రసాద్ సంతోషి మార్కంతో గుడ్సా ఉసెండీ సంబంధం పెట్టుకున్నాడని, తాము చర్య తీసుకునే లోపలే అతను పరారయ్యాడని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

ఊసెండితో పాటు సంతోషి కూడా పోలీసులకు లొంగిపోయారు. సంతోషిని పోలీసులు ఆయన భార్యగా ప్రకటించారు. అయితే వారిద్దరికి పెళ్లి కాలేదని అంటున్నారు. ఆదివాసీ యువతి మిడ్కోను ఊసెండి 1996లో పెళ్లి చేసుకున్నాడు. అతనికి మరో యువతితో సంబంధఁ ఉందని భార్య పార్టీ నేతలకు ఫిర్యాదు చేసిందట. దీంతో అతని స్థాయిని తగ్గించారని అంటున్నారు.

Usendi live in relation with another woman

అయితే, మొదటి బార్య మిడ్కో ఎన్‌కౌంటర్‌లో మరణించింది. దీంతో 2001లో రాజీని పెళ్లి చేసుకున్నాడని అంటున్నారు. తమ మధ్య విభేదాలను రాజీ ఐదేళ్ల క్రితం పార్టీ దృష్టికి తీసుకుని వెళ్లిందట. విభేదాలు వస్తే విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ రాజీతో విడాకులు తీసుకోకుండానే ఊసెండి సంతోషితో సహజీవనం ప్రారంభించాడని మీడియాలో వార్తలు వచ్చాయి. తన సహజీవనం గురించి అతను పార్టీకి చెప్పానని కూడా అంటున్నారట.

తాను హింసాత్మక దాడుల్లోనూ తాను పాల్గొనలేదని ఊసెండి దర్యాప్తు సంస్థలకు చెప్పినట్లు సమాచారం. ఇటీవల లొంగిపోయిన ఊసెండినీ రాష్ట్ర పోలీసులతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ), కేంద్ర రిజర్వ్ దళం (సిఆర్పీఎఫ్) విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+