ప్రధాని: రాజేంద్ర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్, క్లాస్

విజయవాడ: రానున్న సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని అవుతారని, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అవుతారని వ్యాఖ్యానించిన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ పైన పార్టీ అధినేత చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

ఈ వ్యాఖ్యలను చంద్రబాబు చాలా సీరియస్‌గా తీసుకున్నారంటున్నారు. రాజేంద్ర ప్రసాద్‌ను మందలించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారని తెలుస్తోంది. ఇలా వ్యాఖ్యానిస్తే ఇబ్బందులు వస్తాయని, అనవసర చిక్కులు తేవద్దని ఓ సమావేశంలో రాజేంద్ర ప్రసాద్‌ను హెచ్చరించారని తెలుస్తోంది.

Chandrababu class to Rajendra Prasad for his 'PM' comments

తాను కేంద్రంలోకి వెళ్లాలని భావించడం లేదని ఆయన కుండబద్దలు కొట్టారని తెలుస్తోంది. తాను గతంలోను అలా అనుకోలేదని, ఇప్పుడు కూడా కేంద్రం వైపు చూడటం లేదని చెప్పారు. కాగా, ఐదు రోజుల క్రితం రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలరు చేసిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మంగళవారంనాడు మాట్లాడుతూ... 2019లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవుతారన్నారు. కావాలంటే రాసుకోండి అన్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకుంటారని ఆయన చెప్పారు. వెంకయ్య, చంద్రబాబు లివింగ్ లెజెండ్స్ అని ఆయన వ్యాఖ్యానించారు. విభజన చట్టంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదనే విమర్శలో నిజం లేదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+