కాళ్లకు మైక్రోచిప్‌తో పావురం: పాక్ పనేనా?
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలో కాలుకు మైక్రోచిప్ కట్టి ఉన్న ఓ పావురాన్ని భద్రతా సిబ్బంది కనుగొన్నారు. మరో కాలుకు కోడ్ నంబర్‌తో ఉంగరం, రెక్కలపై రాతలు ఉన్న ఈ పావురం తీరు అనుమానం రేకెత్తించడంతో, భద్రతా సిబ్బంది దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తీర ప్రాంత భద్రతా దళం, అటవీశాఖ కేంద్ర హోం శాఖకు ఒక నివేదికను పంపారు.
ఈ విషయాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఫోరెన్సిక్ విభాగాన్ని, ఉగ్రవాద వ్యతిరేక దళాన్ని రంగంలోకి దించింది. ఈ పావురాన్ని తొలుత మార్చి 20న దేవభూమి ద్వారక జిల్లా సరిహద్దు నుంచి ఐదు నాటికల్ మైళ్ల దూరంలో చూశారు.

అక్కడ నిర్మాణంలో ఉన్న జెట్టీ వద్ద కాపలా కాస్తున్న ఓ గార్డు దానిని బంధించాడు. ఒక కాలుకు మైక్రోచిప్ కట్టి ఉండగా, మరో కాలుకున్నరింగుపై 28733 నంబర్ రాసి ఉంది. ఒక రెక్కపై అరబిక్ భాషలో రసుల్-ఉల్-అల్లాహ్ అని, చిప్‌పై బెంజింగ్ డ్యుయల్ అని రాసి ఉంది.
ప్రస్తుతం ఈ పావురం వడినార్ మెరైన్ పోలీస్‌స్టేషన్ కస్టడీలో ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు. పూర్వకాలంలో సమాచారం చేరవేతకు పావురాలను ఉపయోగించేవారని మనకు తెలుసు. అయితే ఈ పావురం ఇన్ని రహస్యాలను మూటగట్టుకొని ఎందుకొచ్చిందన్న దానిపై పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు. దాయాది పాకిస్థాన్ ఏవైనా రహస్యాలను చేరవేసేందుకు పావురాన్ని ఉపయోగించుకుంటుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications