నన్ను,దత్తాత్రేయను కుడుతుంది: కేసీఆర్ చమత్కారం
హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ స్ఫూర్తిని అందరం ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆకాంక్షించారు. హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని ఎన్‌బీటీనగర్, మల్కాజ్‌గిరిలో సీఎం కేసీఆర్ శుక్రవారం పేదలకు క్రమబద్ధీకరణ ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛ హైదరాబాద్ గురించి మాట్లాడారు. దోమ ఎవరినైనా కుడుతుందని, అది సోషలిస్టు అని చమత్కరించారు. అది నన్ను కూడా కుడుతుందన్నారు.

కలెక్టర్‌ను, చివరకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కూడా వదలదని చమత్కరించారు. కాబట్టి, పేదల నుంచి ప్రభుత్వం దాకా అందరం కలిసి హైదరాబాద్‌లో దోమల నిర్మూలనను చేపట్టాల్సి ఉన్నదని వివరించారు.
ప్రజల దీవెనలు ఉంటే హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. అమెరికాలో, లండన్‌లో ఉన్నోడు బంగారమేం తినడం లేదని, మనం లాగే అన్నం తింటున్నారని, వాడు అదే అన్నం తింటాడని, మనం అదే తింటున్నామని, కాకపోతే వాడు ముందుగానే వాళ్లు మేల్కొన్నారన్నారు.












Click it and Unblock the Notifications