ఒడిశా అమ్మాయిల్ని పెళ్లాడుతున్నపటేల్ వర్గీయులు

సూరత్: ఉత్తర గుజరాత్‌, సౌరాష్ట్ర ప్రాంతాల్లోని పటేల్‌ వర్గీయులు ఒడిశా అమ్మాయిలను వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. శుక్రవారం సూరత్‌లో సమస్థ్‌ పాటీదాద్‌ సమాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక వివాహాల్లో పటేల్‌ కులం అబ్బాయిలు ఒడిశాకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు.

43 మంది ఇతర కులాల అమ్మాయిలను పటేల్ సామాజిక వర్గం అబ్బాయిలు పెళ్లాడారు. గత మూడేళ్లలో పటేల్‌ వర్గీయులు పెళ్లి చేసుకున్న ఒడిశా వధువుల సంఖ్య 72. లింగ నిష్పత్తిలో తేడా ఎక్కువగా ఉండటంతో సూరత్‌లో స్థిరపడిన ఒడిశా కుటుంబాల నుంచి వధువులను పటేల్‌ వర్గీయులు ఎంపిక చేసుకుంటున్నారు.

Odisha girls marry Patel boys from Surat

ఇటీవల కాలంలో ఉత్తర గుజరాత్‌లోని అగ్రకులాలైన పటేళ్లు కొందరు గిరిజన అమ్మాయిలను కూడా వివాహమాడుతున్నారు.

తనకు కడ్వా ఉపకులం నుంచి అమ్మాయి దొరకక పోవడంతో బ్రహ్మచారిగా ఉండిపోయానని, అప్పట్లో కులాంతర, ప్రాంతాంతర వివాహాలు నిషిద్ధమని వ్యాపారి అంబాలాల్‌ పటేల్‌(58) చెప్పారు. గుజరాత్‌లో పురుషులు, స్త్రీల నిష్పత్తి 113:100గా ఉంది. ఇక పాటీదార్‌ కులంలో అయితే ఈ తేడా మరింత ఎక్కువగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+