వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ ఎంపి టిఆర్ఎస్ అభ్యర్థిగా వివేక్?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వరంగల్ లోకసభ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్ర తర్చనబర్చనలు పడుతోంది. వరంగల్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కడియం శ్రీహరిని తన ఎంపి పదవికి రాజీనామా చేయించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.. రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వరంగల్ పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి ఎవర్నీ పోటీకి దించాలని టిఆర్ఎస్ తర్జనభర్చనలు పడుతోంది. సార్వత్రిక ఎన్నికల ముందు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి పెద్దపల్లి లోకస్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎంపి వివేక్‌ను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Vivek likely to join TRS may contest from Warangal MP seat

టిఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుని వరంగల్ లోకసభ స్థానం నుంచి పోటీ చేయించాలని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వివేక్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు టిఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

అంతా టిఆర్ఎస్ అనుకున్నట్లు జరిగితే వరంగల్ పార్లమెంటు స్థానానికి జరిగే ఉప ఎన్నికల బరిలో టిఆర్ఎస్ అభ్యర్థిగా వివేక్ పోటీ చేసే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ మాజీ ఎంపి అయిన వివేక్ టిఆర్ఎస్ పార్టీలో చేరతారా? లేదా అనేది తేలాల్సి ఉంది.

English summary
It said that Congress former MP Vivek likely to join Telangana Rashtra Samithi may contest from Warangal MP seat bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X