వెనక్కెళ్లండి!: సీఎం ఎదుటే మహిళా జర్నలిస్ట్‌కి చేదు
ముంబై: ముఖ్యమంత్రి ఎదుటే ఓ మహిళా పాత్రికేయురాలికి చేదు అనుభవం ఎదురయింది. సదరు టెలివిజన్ పాత్రికేయురాలికి మొదటి మూడు వరుసల్లో సీటు ఇచ్చేందుకు నిరాకరించడం బాధాకరం. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సన్మాన కార్యక్రమంలోనే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.
స్వామినారాయణ్ ఆలయంలో గోవధను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నందున ముఖ్యమంత్రిని సన్మానించాలని శ్రీ శాంతాక్రజ్ జైన్ తపగచ్చ సంఘం భావించింది. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు మహిళా పాత్రికేయులనూ ఆహ్వానించారు.

అయితే ముందు వరుసలో కూర్చొనేందుకు మరాఠీ టీవీ చానెల్ రిపోర్టర్ రేష్మి పురాణిక్ వచ్చారు. నిర్వాహకులు ఆమెను అడ్డుకున్నారు. మొదటి మూడు వరుసలు పురుషులకు కేటాయించామని, నాలుగో వరుసకు వెళ్లాలంటూ సూచించారు.
ఇది మహిళలను కించపరచడమేనంటూ అన్ని రాజకీయ పార్టీలు దుమ్మెత్తి పోశాయి. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఆర్గనైజర్ల తీరును ముఖ్యమంత్రి తప్పుపట్టారు.
దీనిపై రష్మీ పూర్ణిక్ స్పందిస్తూ.. తాను మూడో వరుసలో కూర్చున్నానని, ఆ సమయంలో సెక్యూరిటీ గార్డులు, వాలంటీర్లు వచ్చారని, తనను కూర్చునేందుకు అంగీకరించారని చెప్పారు. జైన్ సంప్రదాయం ప్రకారం అలా కూర్చోవడం వద్దనే అలా చేసినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications