‘3ఆలయాలివ్వండి-39,997మసీదులు తీసుకోండి’
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం అంశంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి మరోసారి స్పందించారు. రామమందిర నిర్మాణం అంశంపై ప్రస్తావిస్తూ.. మహాభారతంలో కృష్ణుడిలా.. తాము ముస్లింలకు మంచి అవకాశమిస్తున్నామని తెలిపారు.
‘మాకు(హిందువులు) 3ఆలయాలు ఇవ్వండి. మీరు(ముస్లింలు) 39,997 మసీదులు తీసుకోండంటూ' స్వామి ఆదివారం ట్వీట్ చేశారు. ముస్లింలు దుర్యోధనులు కాకూడదనే తాను కోరుకుంటున్నానని సుబ్రమణ్యస్వామి అన్నారు.

రామమందిర నిర్మాణంపై స్వామి గతంలోనూ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.మందిర నిర్మాణాన్ని రాజకీయ పరంగా చూడొద్దని పేర్కొన్నారు. ఎన్నికల కోసం మందిర నిర్మాణం చేపట్టడం లేదని తెలిపారు.
ప్రతి ఏడాది ఎక్కడో ఓ చోట ఎన్నికలు జరుగుతాయని.. అలా అని ప్రభుత్వం పనులు మానుకుని కూర్చోలేదన్నారు. రామ జన్మభూమిపై చర్చను అడ్డుకుంటున్న వారిపైనా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.












Click it and Unblock the Notifications