భార్య కోసం మొత్తం థియేటర్నే బుక్ చేసిన భర్త

Posted By:
Subscribe to Oneindia Telugu

ధర్మశాల: భార్య కోరే చిన్న చిన్న కోరికలను తోసిపుచ్చే భర్తలున్న ఈరోజుల్లో... భార్య కోరిక మేరకు మొత్తం థియేటర్‌నే బుక్ చేసిన భర్క కథ ఇది. అంతేకాదు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ని గురించి కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిందే.

వివరాల్లోకి వెళితే... హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హరీమ్‌పూర్ ప్రాంతానికి చెందిన శంకర్ మసాఫిర్, గీతాంజలి భార్యా భర్తలు. గీతాంజలికి హీరో సల్మాన్ ఖాన్ అంటే ఎనలేని అభిమానం. దీంతో సల్మాన్, అనుష్క నటించిన 'సుల్తాన్' సినిమా రంజాన్ పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.

Salman Khan

శంకర్ భార్య గీతాంజలి కూడా సల్మాన్ ఫ్యాన్ కావడంతో భర్తతో సినిమా చూడాలని చెప్పింది. అయితే, ప్రేక్షకుల మధ్యలో కూర్చుని కాకుండా ప్రత్యేకంగా ఈ సినిమాను ఆమెకు చూపించి ఆశ్చర్యపరచాలని నిర్ణయించుకున్నాడు.

దీంతో సినిమా విడుదలకు ఒకరోజు ముందే గురుకుల్ మాల్‌లోని థియేటర్ మొత్తాన్ని వారిద్దరికే బుక్ చేశాడు. సినిమాను చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన గీతాంజలి ఒక్కసారిక ఆశ్చర్యపోయింది. థియేటర్‌లో తనతో పాటు తన భర్త మాత్రమే ఉండటంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరోవైపు 'థియేటర్ మొత్తం బుక్ చేసిన శంకర్ 120 మందితో వస్తాడనుకుంటే..తన భార్యను మాత్రమే తీసుకుని వచ్చి ఆశ్చర్యపరిచారు' అని థియేటర్ నిర్వాహకులు కూడా చెప్పడం విశేషం. ఏదిఏమైతేనేం తన భార్య కోరికను తీర్చి ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Salman Khan’s Sultan is being touted as 2016’s biggest hit. A man booked an entire show of a cinema hall for the screening of -starrer Sultan to please his wife in Hamirpur city of Himachal Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X