అమిత్ షా వ్యూహం: బిజెపిలోకి నటుడు ఉపేంద్ర

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెసు ప్రభుత్వాన్ని గద్దె దించడానికి బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా చక్రం తిప్పుతున్నట్లే కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని దించేసి బిజెపిని గద్దెనెక్కింంచడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.

బిజెపిలో చేరికల కార్యక్రమాన్ని ముమ్మరం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.శనివారం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటకలో పర్యటించే సందర్భంగా కన్నడ నటుడు ఉపేంద్ర బిజెపిలో చేరతారనే ప్రచారం సాగుతోంది. శనివారం తాను బిజెపిలో చేరే విషయాన్ని ఉపేంద్ర ప్రకటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు..

Actor Upendra may join in BJP

బెంగళూరులో శనివారం సాయంత్రం ఉపేంద్ర మీడియా సమావేశంలో మాట్లాడతారని, తన రాజకీయ ప్రవేశం గురించి వెల్లడిస్తారని అంటున్నారు. రాజకీయాల పట్ల ఉపేంద్రకు ఆసక్తి ఉన్నట్లు, కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

Watch : How UP Minister Upendra Tiwari Sweeps Office And Corridor - Oneindia Telugu

కొత్త పార్టీ పెట్టే ఆలోచనను విరమించుకుని ఆయన బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. శనివారం సాయంత్రానికి ఉపేంద్ర రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that actor Upendra may join in BJP and play key role in Karnataka politics.
Please Wait while comments are loading...