దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

వెనిజులాలో చెప్పుకోలేని బాధ, సెక్స్ సంక్షోభం!: పడక గదికి వెళ్లాలంటేనే భయం

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  వెనిజులా: వెనిజులాలో ఓ వైపు పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పడిపోవడం, మరోవైపు సామాన్యుడికి అందుబాటులో లేని ధరలు ఉండటంతో జనాలకు సరిగా తిండి లేకుండా పోయింది. ఒక్క బ్రెడ్ కోసం గంటల తరబడి క్యూలైన్లు కడుతున్నారు. మరోవైపు రుణదాతల నుంచి ప్రభుత్వానికి ఒత్తిడి వస్తోంది.

  వెనిజులాలో ఇలాంటి దారుణమైన పరిస్థితి నెలకొని ఉంది. ఇంతేకాదు, ఈ ఇబ్బందులతో రాత్రి వేళ పడకగదికి వెళ్లాలంటేనే భయపడుతున్నారట. అలాంటి పరిస్థితి నెలకొని ఉందని అంటున్నారు. ఇలాంటి చెప్పుకోలేని కష్టాలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

   అందుకే పడకగదికి దూరం

  అందుకే పడకగదికి దూరం

  ఇప్పటికే సంక్షోభం ఎదుర్కొంటున్నామని, తమకే సరిగా ఆహారం దొరకడం లేదని, ఇప్పుడు తమ కలయిక వల్ల వచ్చే కొత్త ప్రాణాన్ని ఆకలితో అలమటించేలా చేయడం ఎందుకని భావిస్తూ పురుషులు, స్త్రీలు పడకగదికి కూడా దూరంగా ఉండే పరిస్థితులు వచ్చాయట.

   కండోమ్‌లు కొందామన్నా.. అందని ధరలు

  కండోమ్‌లు కొందామన్నా.. అందని ధరలు

  మరో షాకింగ్ విషయం ఏమంటే.. పడక గదిలో కండోమ్‌లు లేదా గర్భ నిరోదక మాత్రలు వాడుదామని అనుకున్న వారికి అవి కూడా దొరకడం లేదని తెలుస్తోంది. ఎక్కడో లభించినా సామాన్యులకు అందుబాటులో లేక, ఆకాశాన్ని అంటే ధరలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో వాటికి కూడా దూరంగా ఉంటున్నారట.

   ఇంట్లోనే తయారు చేసుకునే చిట్కాలు

  ఇంట్లోనే తయారు చేసుకునే చిట్కాలు

  వెనిజులాలో గర్భ నిరోధకాల కొరత తీవ్రంగా ఉండటంతో ఇతర దేశాల నుంచి తెప్పించుకుంటున్నారు. దీంతో పాటు ఇంట్లోనే తయారు చేసుకునే చిట్కాలను అక్కడి పత్రికలు ఇస్తున్నాయి.

   వారి ద్వారా మాత్రలు

  వారి ద్వారా మాత్రలు

  వెనిజులాలో ఉంటున్న వారు బయట ఉండే తమ బంధువులు, స్నేహితుల ద్వారా కండోమ్‌లు, మాత్రలు తెప్పించుకుంటున్నారు. మరికొందరు ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారట.

   కండోమ్‌లు ఇచ్చేవారు కానీ

  కండోమ్‌లు ఇచ్చేవారు కానీ

  గతంలో ఆసుపత్రులలో కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలు ఉచితంగా ఇచ్చేవారట. కానీ దేశం అప్పుల్లో కూరుకుపోవడంతో నిలిపేశారు. తమకు గర్భం వచ్చిందని తెలిస్తే, కొందరు మహిళలు తమ గర్భస్రావం కోసం చెప్పలేని ప్రయోగాలు చేస్తున్నారని కూడా తెలుస్తోంది.

  ఆకాశాన్ని అంటే ధరలు

  ఆకాశాన్ని అంటే ధరలు

  కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రల ధరలు ఎంతగా పెరిగాయంటే... గత కొన్నాళ్లుగా మెడికల్ షాపు యజమానులు కూడా వాటిని చూడలేదని అంటున్నారు. 21 మాత్రలు ఉంటే ప్యాకెట్ ధర ఏకంగా లక్షకు పైగా వెనిజులా బొలివియర్లుగా ఉంది. మూడు కండోమ్స్ కొనాలన్నా జీతంలో దాదాపు మూడు వంతులు ఖర్చు చేయాలి. అందుకే వాటిని కొనలేని స్థితిలో ఉన్నారు.

  కండోమ్స్ దొరకక కొత్త కష్టాలు

  కండోమ్స్ దొరకక కొత్త కష్టాలు

  కండోమ్స్, గర్భ నిరోదక మాత్రలు దొరకక పోవడం వల్ల ప్రజలు సురక్షితం కానీ లైంగిక చర్యల్లో పాల్గొంటున్నారని తెలుస్తోంది. దీంతో హెచ్ఐవీతో పాటు పలు రోగాల బారిన పడుతున్నారు. అందుకే హెచ్ఐవి పాజిటివ్ రోగుల సంఖ్య భారీగా పెరిగింది.

   మా వాళ్లకు తీసుకు వస్తా

  మా వాళ్లకు తీసుకు వస్తా

  అలిజెండ్రా అనే యువతి మాట్లాడుతూ.. క్రితం సారి తన సిస్టర్ ఇన్ లా తో గర్భ నిరోధక మాత్రలు తెప్పించుకున్నానని, ఈసారి డిసెంబర్‌లో తాను స్పెయిన్ వెళ్తున్నానని, అక్కడి నుంచి తాను తమ కోసం, తమ మిత్రులు, బంధువుల కోసం వాటిని తీసుకు వస్తానని చెప్పారు.

  English summary
  In Venezuela, a collapse in oil prices coupled with nearly two decades of socialist policies has sparked a severe recession and one of the world’s highest inflation rates. People often wait hours in line to buy bread. Prices for staples jump almost by the day. Medical shortages range from antibiotics to cancer drugs.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more