ఎట్టకేలకు జుకర్‌బర్గ్‌కు డిగ్రీ పట్టా, మరో ఘనత కూడా

Posted By:
Subscribe to Oneindia Telugu

మసాచ్యుసెట్స్: ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ హార్వార్డ్ స్కూల్ నుంచి డిగ్రీ పట్టా అందుకోనున్నారు. డిగ్రీ రెండవ సంవ‌త్స‌రంలో ఉండ‌గానే ఫేస్‌బుక్‌ను స్థాపించిన జుకర్ అనంత‌రం త‌న చ‌దువుని కొన‌సాగించ‌లేదు.

2004లోనే హార్వర్డ్ స్కూల్‌కి గుడ్ బై చెప్పారు. హార్వర్డ్ స్కూల్ డ్రాపవుట్‌గా మిగిలారు. అయితే, హార్వ‌ార్డ్ వ‌ర్సిటీ ఆయ‌న‌కు గౌరవ డిగ్రీ పట్టా అందించాలని నిర్ణ‌యించింది.

ఈ ఏడాది మే నెలలో జరుగనున్న‌ హార్వర్డ్స్ అప్ కమింగ్ గ్రాడ్యుయేషన్ సెర్మినీలో జుకర్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ప్ర‌సంగించ‌నున్న‌ అతిపిన్న వయస్కుడిగా కూడా జుకర్ పేరు తెచ్చుకోనున్నారు.

Mark Zuckerberg, Harvard Dropout, Will Finally Get His Degree

అదే రోజు ఆయ‌నకు ప‌ట్టాను అందుకుంటారు. ప్ర‌పంచంలో అత్యంత ఆద‌ర‌ణ సంపాదించుకున్న ఫేస్‌బుక్‌కు సుమారు 2 బిలియన్ ఖాతాదారులున్నారు.

ఇటీవలి కాలంలో ప్రారంభోత్సవ ప్రసంగాన్ని ఇవ్వబోతున్న అతి పిన్న వయస్కుడిగా జుకర్ గుర్తింపులోకి రానున్నారని హార్వార్డ్ డైలీ స్టూడెండ్ న్యూస్ పేపర్ ది హార్వార్డ్ క్రిమ్సన్ నోట్స్‌లో తెలిపింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Facebook founder, and famously a Harvard dropout, Mark Zuckerberg is finally heading back to school. This time, he'll even get a degree.
Please Wait while comments are loading...