సీఎం కుర్చీలో బాలకృష్ణ: అసలేం జరిగిందంటే..?
Recommended Video

అమరావతి: బుధవారం అమరావతిలో లేపాక్షి ఉత్సవాలపై సీఎం క్యాంపు కార్యాయలంలో సమీక్షను జరిపిన సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుర్చీలో కూర్చున్నట్లు జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పష్టనిచ్చారు.
ఈ సమావేశంలో బాలకృష్ణ కూర్చున్న కుర్చీ సీఎంది కాదని, కేవలం ఆ స్థానంలో ఉన్న మరో కుర్చీలో మాత్రమే ఆయన కూర్చున్నారని చెప్పారు.

సీఎం కుర్చీలో..
ఏపీ పరిశ్రమల శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరైన సమావేశానికి ముందే, అక్కడ చంద్రబాబు కూర్చునే కుర్చీ తీసివేసి.. ఆ స్థానంలో మరో కుర్చీ వేసినట్లు తెలిపారు. అయితే, చంద్రబాబు స్థానంలో ఉన్న కుర్చీ కావడంతో అది సీఎం కుర్చీనని అందరూ పొరబడ్డారని వారంటున్నారు.

బాలకృష్ణ సమీక్ష
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం పర్యటక, సాంస్కృతిక, రవాణా శాఖ అధికారులు, అనంతపురం జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులతో లేపాక్షి ఉత్సవ కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు.

లేపాక్షి ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి, వెంకయ్య
లేపాక్షిలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కనీసం 20గదులకు తక్కువ కాకుండా వసతిగృహాన్ని నిర్మించాలని పేర్కొనగా.. వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని పర్యటకశాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా వెల్లడించారు. గతంలో ఉత్సవాలను ఫిబ్రవరి 24, 25 తేదీలలో నిర్వహించాలని భావించినా మార్చి 9, 10 తేదీలకు మార్చారు. పర్యటక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, ఏపీటీడీసీ ఎండీ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ.. ఉత్సవాల్లో మొదటిరోజున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రెండోరోజున ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

సోషల్ మీడియాలో చర్చ
ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారనే ప్రచారం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే స్థాయి సమీక్ష నిర్వహించే సమయంలో సీఎం స్థానంలో కూర్చున్న బాలయ్య ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పలువురు నెటిజన్లు సీఎం కుర్చీలో కూర్చోవడం ఏంటి? అంటూ ప్రశ్నలు గుప్పించారు. ఈ సమావేశంలో మంత్రులుండగా.. ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య ఆ సీట్లో కూర్చోవడమేంటని అంటున్నారు. కాగా, సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌లు వరల్డ్ ఎకనామిక్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications