ఎముకలు బలంగా ఉండాలంటే

శరీరం మొత్తం ఎముకలపై ఆధారపడివుంటుంది. మనిషి చురుగ్గా ఉన్నాడంటే.. తేలికగా కదులుతున్నాడంటే అందుకు ఎముకల బలంగా ఉండాలి. ఎముక గట్టిగా ఉండాలంటే అందులో ఉండాల్సివన్నీ నిండివుండాలి. అప్పుడే అవి బలంగా ఉంటాయి. ఇలా లేకపోతే ఆస్టియోపోరోసిస్ ముప్పు కచ్చితంగా పెరుగుతుంది. ఎముకలు బలహీనపడితే విరిగిపోతాయి. వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

పోషకాహారం తీసుకోవాలి: సమతుల్యమైన పోషకాహారం తీసుకుంటుండాలి. విటమిన్ డి చాలా అవసరం. ఎముకల ఆరోగ్యం కాల్షియంతో మెరుగుపడుతుంది. పాల ఉత్పత్తులతోపాటు సీఫుడ్, ఆకుకూరలు తీసుకోవాలి. వీటిల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఉదయం, సాయంత్రం కొద్దిసేపు ఎండలో ఉంటే విటమిన్ డి లభిస్తుంది.

5 tips To keep bones strong

బరువును కంట్రోల్‌ చేసుకోవాలి: బరువు సమతూకంలో ఉండాలి. ఎక్కువున్నా.. తక్కువున్నా ప్రతికూల ప్రభావం ఉంటుంది. బరువు తక్కువున్నా ఎముక సాంద్రత తగ్గుతుంది. ఎక్కువున్నా ఎముక బలహీనపడుతుంది.

వ్యాయామం చేయండి: ఎముకలు బలంగా ఉండాలంటే వ్యక్తి ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి. బరువు మోసే వ్యాయామాలు చేయడంవల్ల ఎముకలు గట్టిగా ఉంటాయి. వ్యాయామం ఎముకలకు మద్దతిచ్చే బలమైన కండరాలను నిర్మిస్తుంది. నడక, పరిగెత్తడం వంటి వ్యాయామాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముకల నష్టాన్ని తగ్గిస్తాయి.​

స్మోకింగ్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి: ఎముకలను నిర్మించడంలో సహాయపడే పోషకాలను వినియోగించే శరీర సామర్థ్యాన్ని ఇవి తగ్గిస్తాయి. ధూమపానం శరీరాన్ని బలహీనపరుస్తుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

రెగ్యులర్ హెల్త్ చెకప్స్‌ చేయిస్తుండాలి: తరచుగా ఎముకల సాంద్రత స్కాన్ చేయించుకుంటుండాలి. దీనివల్ల ఎముకల ఆరోగ్యంపై ఒక అవగాహన కలుగుతుంది. ఎముకల సమస్యలను ముందే గుర్తిస్తే.. దీర్ఘకాలిక సమస్యల ముప్పు తగ్గుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+