నయా స్టైల్ ABC జ్యూస్.. ఇలా చేస్తే సమ్మర్ లో సూపర్ టేస్ట్..
వేసవిలో చాలామంది జ్యూస్ లు తాగేందుకు ఇష్టపడుతుంటారు. హాట్ ఫుడ్ కన్నా కూల్ గా ఉండే ఫుడ్ ను తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే సమ్మర్ లో త్వరగా జీర్ణం అయ్యే ఆహారాన్ని మాత్రమే ఎక్కువగా తీసుకునేందుకు చాలామంది ఇష్టపడతారు. అయితే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్టుకు టేస్టు ఉండే జ్యూస్ ను ఎప్పుడైనా ట్రై చేశారా..? అదే నయా స్టైల్ ABC జ్యూస్.. అవును యాపిల్, బీట్ రూట్, క్యారెట్ జ్యూస్.. ఈ జ్యూస్ ఇప్పుడు చాలా ఫేమస్ అవుతోంది. మారతున్న జీవనశైలి దృష్ట్యా ఇలాంటి జ్యూస్ లను తాగేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఇంట్లోనే ఈజీగా ఈ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇక్కడ చూద్దాం..
ABC జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. ఆపిల్ ఒకటి పెద్ది, బీట్ రూట్ ఒకటి మీడియం సైజులో, క్యారెట్ ఒకటి పెద్దది, నిమ్మకాయ ఒకటి రసం కోసం, పుదీనా కొద్దిగా, అల్లం ఒక అంగుళం, తేనే తగినంత రుచికి సరిపడా, నీరు అవసరమైనంత తీసుకోవాలి.

ఇప్పుడు ABC జ్యూస్ తయారీ విధానం చూస్తే ముందుగా ఆపిల్, బీట్ రూట్, క్యారెట్ లను శుభ్రంగా కడిగి తొక్క తీసి ముక్కలుగా కోసుకోవాలి. ఆ తర్వాత కోసిన ముక్కలను, అల్లం ముక్కను బ్లెండర్ లో వేసి కొద్దిగా నీరు పోయాలి. ఆ తర్వాత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక బ్లెండ్ చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని జల్లెడ సాయంతో వడపోసి రసాన్ని వేరు చేయాలి. ఇప్పుడు వడపోసిన రసంలో నిమ్మరస, ఆకులు, రుచికి సరిపడా తేనె వేసి బాగా కలుపుకోవాలి. అంతే సూపర్ టేస్టీ ABC జ్యూస్ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications