శనగపప్పు, వంకాయ మసాలా కూర.. రుచినే కాదు, మంచి పోషకాహారం కూడా!
శనగపప్పు,వంకాయ మసాలా కూర.. ఇది మన తెలుగు వాళ్ళ సంప్రదాయ వంటకం. ఈ కూర అద్భుతమైన రుచిని అందించడమే కాకుండా, మన శరీరానికి కావలసిన పోషకాలను అందించే మంచి పోషకాహారం కూడా. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో తయారు చేసే ఈ వంటకాన్ని ఎలా తయారు చేయాలి? దేనితో కలిపి తింటే బాగుంటుంది అనేది తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
శనగపప్పు – 1 కప్పు
వంకాయలు- పావు కిలో
ఉల్లిపాయలు – 2(సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి – 2(కట్ చేసినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1టీస్పూన్
పసుపు – ½ టీస్పూన్
కారం – 11/2 టీస్పూన్ (రుచికి తగ్గట్టు)
ఉప్పు- 1స్పూన్ రుచికి తగినంత
ధనియాల పొడి – 1టీస్పూన్
నూనె – 3టేబుల్ స్పూన్లు
పోపు గింజలు- ఒక స్పూన్
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం
ముందుగా శనగపప్పును 3–4 గంటలు నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వంకాయలను పొడవుగా ముక్కలుగా కట్ చేసి ఉప్పు కలిపిన నీటిలో ఉంచాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడి అయిన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసి, పోపుగింజలు కలర్ మారిన తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
ఇలా వండితే బాగుంటుంది
ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో వంకాయ ముక్కలు, పచ్చిశనగపప్పు వేసి కలిపి సిమ్ లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. కాసేపు మగ్గిన తర్వాత అందులో అర టీ స్పూను పసుపు, ఒక స్పూను ఉప్పు, రుచిని బట్టి వేసుకోవాలి. మళ్లీ కాసేపు మగ్గిన తర్వాత, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి.
రుచికరమైన శనగపప్పు, వంకాయ మసాలా కూర రెడీ
శనగపప్పు ఉడికింది అని నిర్ధారించుకున్న తర్వాత, అందులో ఒకటిన్నర స్పూన్ కారప్పొడి, అర స్పూన్ గరం మసాలా వేసి కలిపి మళ్లీ మూత పెట్టి ఉడికించుకోవాలి. కూర పూర్తిగా ఉడికిందని నిర్ధారించుకున్నాక అందులో ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.అంతే రుచికరమైన శనగపప్పు వంకాయ మసాలా కర్రీ రెడీ అవుతుంది.
శనగపప్పు, వంకాయ మసాలా కూరతో ఆరోగ్య ప్రయోజనాలు
ఈ కూరను వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. రోటీలు, చపాతీలతో కూడా తింటే బాగుంటుంది. ఈ శనగపప్పు వంకాయ మసాలా కర్రీ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. శనగపప్పు మంచి ప్రోటీన్ మూలం కావడంతో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శక్తిని అందిస్తుంది. వంకాయలో ఉండే పోషకాలు కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి.
-
మళ్లీ మళ్లీ తినాలనిపించే "పీతల బిర్యానీ" ఎలా చేయాలంటే..? -
మనం రోజూ తినే ఈ ఆహారాలలో ఆల్కాహాల్ ఉంటుంది.. మీకు తెలుసా! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications