ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు నెయ్యి అసలే తినొద్దు!
మనం తీసుకునే ఆహారంలో మన శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే అన్ని ఆహారాలు అందరికీ మేలు చేయవు. వారి శరీర తత్వాన్ని బట్టి, వారికి ఉన్న ఇతర అనారోగ్య సమస్యలను బట్టి కొన్ని ఆహారాలు మేలు చేస్తే, కొన్ని ఆహారాలు హాని చేస్తాయి. మన శరీరానికి, ఆరోగ్యానికి నెయ్యితో ఎన్నో లాభాలు ఉంటాయని చాలామంది డైటీషియన్లు చెబుతారు.
నెయ్యిలో ఫుల్ పోషకాలు
అయితే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా నెయ్యికి దూరంగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు. సహజంగా నెయ్యిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కె, ఒమేగా త్రీ, ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, బ్యూటీరిక్ యాసిడ్స్, లీనోలిక్ వంటి బోలెడు పోషకాలు ఉంటాయి.

వీరు నెయ్యికి దూరంగా ఉండాలి
అయితే ఈ పోషకాలు ఇది తీసుకున్న వారికి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని చెబుతారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నెయ్యి తినకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉండాలి. ఒకవేళ వారు తిన్నప్పటికీ చాలా మితంగా నెయ్యిని ఉపయోగించాలి. డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నవారు నెయ్యి ఎంత తక్కువగా తింటే అంత మంచిది.
ఈ సమస్య ఉంటే నెయ్యి తీసుకోకూడదు
నెయ్యిలో ఉండే కొవ్వుల కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. కనుక వీరు నెయ్యి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు నెయ్యికి దూరంగా ఉంటేనే మంచిది. నెయ్యిలో ఉండే సాచ్యురేటెడ్ కొవ్వులు మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మరింత పెంచే ప్రమాదం ఉంటుంది. ఇక జీర్ణ సమస్యలతో బాధపడే వారు కూడా నెయ్యిని ఎక్కువగా తీసుకోకూడదు.
ఈ సమస్యలుంటే నెయ్యి తినకూడదు
గ్యాస్, ఎసిడిటీ, వికారం, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారు నెయ్యి ఎక్కువగా తీసుకుంటే కడుపునొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక లివర్ వ్యాధితో బాధపడే వారు కూడా నెయ్యికి దూరంగా ఉండాలి. లివర్ సిర్రోసిస్, హెపటైటిస్ రోగులు నెయ్యి పూర్తిగా మానేస్తే మంచిది. చాలామందికి మిల్క్ ప్రొడక్ట్స్ కు సంబంధించిన పదార్థాలు ఏమి తీసుకున్న రియాక్షన్ వస్తుంది. చర్మం పైన దద్దుర్లు, మంట, వాపు వంటి సమస్యలు వస్తాయి.
వీరికి నెయ్యితో డేంజర్.. జాగ్రత్త
అలాంటివారు కూడా నెయ్యిని తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఒబేసిటీతో బాధపడేవారు, గర్భిణీ మహిళలు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు నెయ్యి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు నెయ్యి తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ ఈ సమస్యలతో బాధపడేవారు నెయ్యి తీసుకోవాలి అనుకుంటే వైద్యుల సలహాతో తీసుకోండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications