పెసరపప్పు తింటున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి!
సాధారణంగా మనం మన ఆహారంలో పప్పులను ఎక్కువగా భాగం చేసుకుంటూ ఉంటాం. అయితే పప్పులలో పెసరపప్పు చాలా ముఖ్యమైన మంచి పోషకాలు ఉన్న ఆహారం. అటువంటి పెసరపప్పును ఆహారంలో భాగంగా చేసుకుంటే, ఎక్కువగా పెసరపప్పును తింటే ఏమవుతుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
పెసరపప్పులో పోషకాలు పుష్కలం
పెసరపప్పు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెసరపప్పులో కార్బోహైడ్రేడ్లు, ఫైబర్, విటమిన్ బి 9, బి 4, విటమిన్ బి 2, బీ 3, బి 5, బి 6 పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, ఐరన్ కూడా పెసరపప్పులో ఉంటాయి. పెసరపప్పులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.

పెసరపప్పు తినేవారికి హెల్త్ బెనిఫిట్స్
ప్రతిరోజు మొలకెత్తిన పెసలను ఉదయాన్నే తింటే శరీరంలో అధిక మొత్తంలో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు చేరుతాయి. ఇవి మీ శరీరాన్ని అనేక వ్యాధుల బారి నుంచి కాపాడతాయి. పెసరపప్పు ఎక్కువగా తినేవారిలో క్యాన్సర్, గుండె జబ్బులు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. పెసరపప్పులో ఉండే విటాక్సిన్, ఐసో విటాక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో అధిక వేడిని తగ్గించి దెబ్బతిన్న కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.
బరువు తగ్గేందుకు పెసరపప్పు
పెసరపప్పు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రిస్తుంది. దీంతో గుండె జబ్బులు తగ్గుతాయి .పెసరపప్పులో పొటాషియం, మెగ్నీషియం మరియు ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి .పెసరపప్పు పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కడుపుని డిటాక్సిఫై చేసి శుభ్రపరుస్తుంది.
పెసరపప్పు ఆహారంలో భాగం చేసుకుంటే బెస్ట్
పెసరపప్పులో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలిని తగ్గించి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పెసరపప్పును ఆహారంలో నిత్యం భాగంగా చేసుకోవడం వల్ల మిక్కిలి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కనుక పెసరపప్పు విషయంలో ఎటువంటి సంకోచం లేకుండా ఆహారంలో భాగంగా చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications