స్పైసీ మటన్ బిర్యానీ తెగ కుమ్మేస్తున్నారా?

మటన్ బిర్యానీ అంటే ఇష్టపడని వారు దాదాపు ఎవరు ఉండరు. ఇక దసరా పండుగ నాడు అయితే గొర్రెలు, మేకలు కోసి చాలామంది మటన్ బిర్యానీని ప్లేట్ల కొద్దీ లాగిస్తూ ఉంటారు. మటన్ బిర్యానీ తినే వారు ఖచ్చితంగా తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. మరి అవేంటో చూద్దాం.

మటన్ బిర్యానీ ఎక్కువగా తినడం వల్ల అనేక ఆరోగ్య అనర్ధాలు
మటన్ బిర్యానీలో ఫుల్లుగా పోషకాలు ఉంటాయి. మటన్ లో ప్రోటీన్, విటమిన్ బి, కంజుగేటెడ్ లినొలెనిక్ ఆసిడ్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. మటన్ బిర్యానీ తినొచ్చు కానీ విపరీతంగా మటన్ బిర్యానీ తినకూడదు. మటన్ బిర్యానీ ఎక్కువగా తినడం వల్ల అనేక ఆరోగ్య అనర్ధాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

are you eating mutton biryani frequently know these health problems with mutton biryani

మటన్ బిర్యానీతో బరువు పెరిగే ప్రమాదం.. ఇంకా ఈ సమస్యలు
మటన్ బిర్యానీ ఎక్కువగా తినడం వల్ల అందులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. మటన్ బిర్యానీ ఎక్కువగా తినేవారిలో బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మటన్ బిర్యానీ ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. మటన్ బిర్యానీలో కేలరీలు, కొవ్వులు, నూనెలు ఎక్కువగా ఉండడం వల్ల ఇటువంటి అనారోగ్య ప్రమాదాలు పొంచి ఉంటాయి.

జీర్ణ సమస్యలు, గుండె జబ్బులకు మటన్ బిర్యానీ కారణం
మటన్ బిర్యానీ లో ఉండే అధిక కొలెస్ట్రాల్ రక్తనాళాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోయేలా చేసి గుండె జబ్బులు, స్ట్రోక్స్ రావడానికి కారణమవుతుంది. ఇక మటన్ బిర్యానీలో ఎక్కువగా కొవ్వు పదార్థాలు, మసాలాలు ఉండటం వల్ల ఇవి జీర్ణ వ్యవస్థ పైన ఒత్తిడి కలిగించి కడుపు నొప్పి అజీర్ణం వంటి అనేక సమస్యలకు కారణమవుతాయి. కాలేయ సమస్యలు ఉన్నవారు మటన్ బిర్యానీ ని ఎక్కువగా తినడం మంచిది కాదు.

మటన్ బిర్యానీ విషయంలో ఇలా ఉంటేనే ఆరోగ్యం
ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు తినకుండా ఉంటేనే మంచిది. మటన్ బిర్యానీ తినేవారు సాధ్యమైనంతవరకు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తక్కువ కొవ్వు ఉండే మటన్ ముక్కలను బిర్యానీ చేయడానికి ఎంచుకోవాలి. బిర్యానీని కూడా చాలా మితంగా తినాలి.

బిర్యానీ ఇలా తింటే నో ప్రాబ్లమ్
వారానికి ఒకసారి మాత్రమే బిర్యానీ తింటే మంచిది. ఇక మటన్ బిర్యానీని వండే క్రమంలో ఇష్ట రాజ్యాంగా, నూనె కుమ్మరించకుండా మితంగా నూనె, మసాలాలు వినియోగించాలి. మటన్ బిర్యానీ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించి, జాగ్రత్తపడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+