నాటుకోడి పులుసు తింటున్నారా?.. ఇది తెలుసుకోండి!
మాంసాహారం తినేవారు ఎక్కువగా ఇష్టపడేది నాటుకోడి పులుసు. చిల్లు గారెను ఈ పులుసులో కలుపుకొని తింటే వచ్చే రుచే వేరు అంటుంటారు. మందుబాబులకు కూడా పెగ్గు వేసేటప్పుడు నాటుకోడి పులుసు ఉంటే వారికి పండగే. సాధారణంగా మనకు బ్రాయిలర్ చికెన్ దొరుకుతుంది కానీ నాటుకోడి దొరకడం అరుదు. అందులోను చాలా లేతగా ఉండే నాటుకోడి పులుసు తింటే ఆ మజానే వేరు. ఎంతో ఇష్టంగా తినే ఈ పులుసు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం.
ఆరోగ్య సమస్యలు ఉన్నవారు
అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నాటుకోడి పులుసును తినే ముందు వైద్యుని సలహా తీసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మసాలాలు, కొవ్వు పదార్థాలు ఈ సమస్యలను తీవ్రతరం చేస్తాయి.

అలర్జీలు
కొందరికి కొన్ని రకాల మసాలాలకు లేదా నాటుకోడికి అలర్జీ ఉంటుంది. నాటుకోడి పులుసు తినే ముందు మీకు అలర్జీ ఉందా? లేదా? అని తెలుసుకోండి.
పరిమాణం
నాటుకోడి పులుసులో కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని తక్కువగా తీసుకోవాలి.
తయారీ విధానం
ఇంట్లో తయారు చేసే నాటుకోడి పులుసు కంటే బయట రెస్టారెంట్‌లలో తయారు చేసే నాటుకోడి పులుసులో అధికంగా నూనె, మసాలాలు వాడతారు. అందుకే ఇంట్లో తయారు చేసే నాటుకోడి పులుసును తినడం మంచిది. నాటుకోడిని వేయించేటప్పుడు తక్కువ నూనె వాడి తక్కువ సమయం వేయించడం మంచిది.
నాటుకోడి పులుసును ఆరోగ్యంగా తినాలంటే
నాటుకోడి పులుసుతో పాటు సలాడ్ లేదా తాజా కూరగాయలు తినాలి.
బ్రౌన్ రైస్ లేదా రాగి సంగటితో నాటుకోడి పులుసు తినాలి.
నాటుకోడి పులుసులో తక్కువగా మసాలాలు వాడాలి.
నాటుకోడి పులుసును తరుచుగా తినొద్దు.
వేడి వేడిగా కాకుండా చల్లారిన తర్వాత తింటే మంచి రుచి ఉంటుంది.
గర్భిణీలు, పిల్లలు, వృద్ధులు నాటుకోడి పులుసు తినే ముందు వైద్యుని సలహా తీసుకోవాలి. నాటుకోడి పులుసును మితంగా తీసుకుంటే ఎంతో ఆరోగ్యం. అధికంగా తీసుకోకూడదు.












Click it and Unblock the Notifications