నిద్ర పట్టట్లేదా? హాయైన నిద్ర కోసం ఈ హెర్బల్ టీలను తాగండి!

ప్రస్తుత సమాజంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఎవరైతే నిద్ర సరిగ్గా పోరో వారి ఆరోగ్యం పాడవుతుంది. వారు చురుగ్గా పనిచేసుకోలేరు. ఎక్కువకాలం నిద్రలేమి సమస్య కొనసాగితే ఆరోగ్యానికి చేటు జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వారికి నిద్ర పట్టడం కోసం కొన్ని హెర్బల్ టీ లు ఎంతగానో సహకరిస్తున్నాయి. మరి వాటిని గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ఈ టీ తాగితే హాయిగా నిద్ర పడుతుంది
సాధారణంగా నిద్రపోకుండా ఉండాలంటే టీ తాగుతారు. అయితే మంచి నిద్ర పోవడానికి కూడా కొన్ని రకాల టీలు ఉపయోగపడతాయి. ఇవి మన మానసిక ఆందోళనను తగ్గించి, ఒత్తిడిని తగ్గించి మనకు బాగా నిద్ర పట్టేందుకు దోహదం చేస్తాయి. ప్రశాంతతను కలిగించి నిద్రను మెరుగుపరుస్తాయి. ఇక అటువంటి టీలలో గ్రీన్ టీ ఒకటి.

Can t sleep Drink these herbal tea for a restful sleep

గ్రీన్ టీతో హాయిగా నిద్ర
గ్రీన్ టీ లో ఎల్ థియనైన్ అనే అమైనో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. గ్రీన్ టీ తాగినప్పుడు చాలా హాయిగా అనిపించి నిద్ర పడుతుంది. అయితే కెఫీన్ తక్కువగా ఉండే గ్రీన్ టీ రకాన్ని ఎంచుకొని తాగడం ఎంతో మంచిది. ఇక మనకు నిద్ర బాగా పట్టడానికి ఉపయోగపడే టీ లలో చామంతి టీ ఒకటి.

చమోమైల్ టీ, లావెండర్ టీ తో హాయిగా నిద్ర
ఈ చామంతి టీ ని తాగడం వల్ల కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. చమోమైల్ టీలో ఉండే ఫ్లేవర్స్ శరీరానికి హాయిని ఇస్తాయి ఇది నాణ్యమైన నిద్ర పట్టడానికి ప్రతి ఒక్కరికి సహకరిస్తుంది. ఇక ప్రశాంతమైన నిద్రపోవడానికి లావెండర్ టీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్ల మన నిద్రలో నాణ్యత పెరుగుతుంది. ఈ టీ తాగినట్లయితే మన శరీరం చాలా రిలాక్స్ అవుతుంది. ఆందోళన తగ్గుతుంది.

గిన్ సెంగ్ టీ
గిన్ సెంగ్ టీ.. ఈ టీలో అడాప్టేజన్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి.. ఇవి మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యతను తగ్గిస్తాయి. ఇవి మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ఈ గిన్ సెంగ్ టీ బ్యాగులు మార్కెట్లో బాగానే లభ్యమవుతున్నాయి.

వలెరియన్ మొక్క వేరుతో చేసిన టీ
ఇక మనకు ప్రశాంతంగా నిద్ర పట్టించే టీ లలో వలేరియన్ మొక్క వేరుతో చేసే టీ ఒకటి. వలేరియన్ మొక్క వేరులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి నిద్రలేమి సమస్యను తగ్గిస్తాయి. ఈ టీ తాగడం వల్ల నిద్ర మెరుగుగా పడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి నాణ్యమైన నిద్రకు ఈ టీ ఎంతగానో సహకరిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+