బరువు తగ్గేందుకు అద్భుత మంత్రం
ఈరోజుల్లో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రధాన సమస్యగా బరువు పెరగడం అనేది మారిపోయింది. శరీరంలో కొవ్వు పేరుకుపోవడంవల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. అధికంగా కొవ్వు ఉండటంవల్ల కాలేయ సమస్యలతోపాటు గుండె జబ్బులకు దారితీస్తున్నాయి. కొవ్వును తగ్గించుకోవడం కోసం జిమ్, యోగా, జాగింగ్, రన్నింగ్ లాంటివి చేస్తున్నారు.
ఫిట్ నెస్ ను కాపాడుకోవాలనే ఆలోచన అందరిలో కలుగుతోంది. బిజీగా ఉంటున్న సరే బాడీ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంచాలనుకుంటున్నారు. అలాంటివారి కోసం చాలా డైట్ లు అందుబాటులో ఉంటున్నాయి. వాటిల్లో కిటో డైట్ ఒకటి. కొంతమంది పూర్తిగా అన్నం మానేసి కూరగాయలు, పండ్లు లాంటివి తీసుకుంటున్నారు. మరికొందరు బరువు తగ్గించే జ్యూస్ లు తాగుతున్నారు. ఇలాంటి జ్యూస్ కోసమే మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ జ్యూస్ తగిన తర్వాత వచ్చే ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి.

మొదటగా ఈ జ్యూస్ చేసుకోవడానికి క్యాప్సికం కావాలి. కొన్నిరకాల కూరగాయలను జ్యూస్ చేసుకొని తాగుతున్నట్లుగానే క్యాప్సికం జ్యూస్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ముక్కలుగా కోసి నీరు పోసి 10 నిముషాలు నానబెట్టాలి. నీటిని తీసేసి 15 నిముషాలు ఆరబెట్టాలి. తర్వాత దీన్ని జ్యూస్ గాచేసుకొని తాగేయాలి. దీనికి తేనె కలిపితే చాలా బాగుంటుంది. తాగడానికి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు పదిరోజుల్లోనే కరిగిపోతుంది. సులభంగా బరువు తగ్గుతారు. రోజుకు ఒక గ్లాస్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతోమంచిదని, బరువు తగ్గాలంటే క్యాప్సికం జ్యూస్ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications