'దోసకాయ పప్పు' ఇలా చేస్తే ఆ టేస్టే వేరబ్బా..
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ వంటకం "పప్పు". పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం, ప్రొటీన్లు శరీరానికి అవసరమైన పోషకాలను సమృద్ధిగా ఉంటాయి. సాదాసీదా పదార్థాలతో తయారవుతూనే, అత్యద్భుతమైన రుచిని అందించే ఈ వంటకం కుటుంబంలో చిన్నవారికి, పెద్దవారికి సమానంగా ఇష్టమవుతుంది. ఇందులోనే అందరూ బాగా ఇష్టంగా తినే వంటకం అంటే దోసకాయ పప్పు అని చెప్పాలి.
అలానే కూరగాయల్లో దోసకాయను కూడా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఇష్టపడేవారు ఉన్నారు. దోసకాయ లోని సహజమైన తీపి, నీటి శాతం అధికంగా ఉండటం వలన ఇది శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది. దోసకాయను చాలా రకాలుగా చేసుకుంటారు. పప్పులో వేసుకుంటారు. పచ్చడి చేసుకుంటారు. టమాటోతో కలిపి కర్రీ చేసుకుంటారు. దోసకాయ పప్పును మాత్రం ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఫుల్ గా లాగించేస్తారు. ఆ టేస్టీ రెసిపీ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

కావలసిన పదార్థాలు..
కందిపప్పు: 1 కప్పు
దోసకాయ: 1 మధ్యస్థ పరిమాణంలో ఉన్నది (ముక్కలుగా కోసినవి)
టమోటా: 1 (పెద్దది)
పచ్చిమిర్చి: 4-5
ఉల్లిపాయ: 1 చిన్నది
చింతపండు: నిమ్మకాయ సైజులో సగం
కారం: 1 స్పూన్
పసుపు: అర స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
తాలింపు కోసం: నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు.
తయారీ విధానం..
పప్పు ఉడికించడం: కందిపప్పును శుభ్రంగా కడిగి, కుక్కర్‌లో వేయండి. అందులో కోసిన దోసకాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు మరియు తగినన్ని నీళ్లు పోయండి.
ఉడికించే సమయం: కుక్కర్ మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
మెత్తగా చేయడం: పప్పు ఉడికిన తర్వాత ప్రెజర్ పోయాక మూత తీసి, అందులో చింతపండు రసం (లేదా నానబెట్టిన చింతపండు), కారం మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పు గుత్తితో మెత్తగా ఎనపండి.
తాలింపు: ఒక చిన్న బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు మరియు కరివేపాకు వేసి వేయించాలి.
కలపడం: ఈ తాలింపును సిద్ధంగా ఉన్న పప్పులో వేసి బాగా కలపండి.
అంతే! వేడివేడి దోసకాయ పప్పు సిద్ధం. ఇది అన్నం లేదా చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది.












Click it and Unblock the Notifications