వారంలో ఎక్కువసార్లు నాన్ వెజ్ తింటున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి!!

చాలామంది నాన్ వెజ్ ను ఇష్టంగా తింటారు. కొంతమంది నాన్ వెజ్ ను వారంలో నాలుగైదు రోజులు తింటారు. నాన్ వెజ్ లో మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ అతిగా నాన్ వెజ్ తినడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాంసాహారం రుచిగా ఉందని వారంలో నాలుగైదు రోజులు తింటే ఆరోగ్యానికి చేటు చేస్తుందని చెబుతున్నారు .

తరచూ రెడ్ మీట్ తింటే ప్రమాదం
ఇలా ఏదైనా సరే అతిగా తినడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మాంసాహారం అధికంగా తినే వారికి పెద్ద పేగుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రెడ్ మీట్ ఎక్కువగా తినేవారిలో జీర్ణక్రియ సమస్యలు వస్తాయని దీర్ఘకాలిక జీర్ణక్రియ సమస్యలు పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు.

Eating non veg frequently in a week Must Know These facts disadvantages

రెడ్ మీట్ తో తీవ్ర అనారోగ్యాలు
అంతే కాదు రెడ్ మీట్ తరచుగా తినేవారిలో గుండె ఆరోగ్యం ప్రభావితం అవుతుందని, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. రెడ్ మీట్ ను నిరంతరం తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని, ఊబకాయం సమస్య వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు రెడ్ మీట్ తినేవారిలో 46% డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

అమెరికాలో అతిగా మాంసం తిని క్యాన్సర్ బారిన పడుతున్న ప్రజలు
కడుపునొప్పి, మలబద్ధకం, వాంతులు, విరోచనాలు వంటి సమస్యలు కూడా అధికంగా వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. రెడ్ మీట్ ను అధికంగా తినే అమెరికాలో చాలామంది కొలొరెక్టల్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని 2024 సంవత్సరంలో సుమారు ఒకటిన్నర మిలియన్ల మందికి పెద్దప్రేగు క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని చెబుతున్నారు.

అతిగా మాంసాహారం తింటే అనర్ధం
కనుక క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని అతిగా మాంసాహారాన్ని తినకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ ఇవేవీ పట్టవని అతిగా మాంసాహారాన్ని తింటే తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతిగా మాంసాహారం మాత్రమే కాదు అతిగా ఏది తిన్న కూడా అనర్ధానికి కారణం అవుతుందని మనం ఏది తిన్న మితంగా తినాలని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+