బొప్పాయి నెలరోజులు తింటే...బరువు ఎంత తగ్గుతారో తెలుసా!

ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తారు పెద్దలుఅయితే మారుతున్న జీవన శైలితో పాటు చాలా మంది ఊబకాయులుగా మారుతున్నారు. శారీరక శ్రమ లేకపోవటం, మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో అనారోగ్యాల బారిన పడుతున్నారు. . ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం ఇప్పుడు చాలా మంది ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు ఫిట్ గా ఉండాలని కోరుకుంటున్నారు. రోగాలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు.

బరువు తగ్గాలంటే బొప్పాయి
అయితే చాలామంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, పోషకాలతో కూడిన ఆహారం తినాలి. అలా పోషకాలు ఇచ్చే వాటిలో బొప్పాయి ఒకటి. సులభంగా బరువు తగ్గడానికి రోజు బొప్పాయి పండు తినాలని చెప్తున్నారు. బొప్పాయిలో ఉండే పోషకాలు ,మనలను ఆరోగ్య వంతులను చేస్తాయని అంటున్నారు.. బరువు తగ్గాలని భావించే వారు ఒక నెలరోజులు క్రమం తప్పకుండా బొప్పాయిని తినాలని డైటీషియన్స్ చెబుతున్నారు.

Eating papaya for a month gives amazing results mainly reduces weight

బొప్పాయితో బెనిఫిట్ ఇలా
బొప్పాయిలో ఉండే ఫైబర్ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. బొప్పాయి లో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో మంచి పోషకాలు మన బరువును నియంత్రిస్తాయి. ప్రతిరోజు జిమ్ కు వెళ్లడం కష్టంగా మారిన వారు డైట్ పాటించడం కష్టం అనుకుంటున్న వారు బొప్పాయిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆహార నిపుణులు చెప్తున్నారు.

బొప్పాయితో చర్మ ఆరోగ్యం కూడా
బొప్పాయిని మనం ఏ సమయంలో తిన్నా సరే ఫలితం ఉంటుంది. బొప్పాయిపండు మన చర్మ ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది. బొప్పాయిని తినడం వల్ల చాలాసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీని కారణంగా పదేపదే తినాలి అనే ఫీలింగ్ కలగదు . బొప్పాయిని అల్పాహారంగా ఉదయం తీసుకుంటే బరువు బాగా తగ్గుతారు. ఎన్నో మంచిపోషకాలు ఉన్న బొప్పాయిని నెలరోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే కచ్చితంగా బరువు తగ్గుతారు.

బీటా కెరోటిన్ యొక్క మంచి మూలకం
ఫైబర్ మరియు డైజెస్టివ్ ఎంజైమ్ లకు మంచి మూలకమైన బొప్పాయి ప్రతిరోజు సాయంత్రం పూట ఒక గిన్నెడు బొప్పాయి ముక్కలను తినడం ఆరోగ్యాన్ని ఇస్తుంది. బొప్పాయి జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. గుండె జబ్బులను రాకుండా చేస్తుంది. మన శరీరంలో కొవ్వును కరిగించడంలో బొప్పాయి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది బీటా కెరోటిన్ యొక్క మంచి మూలకం కావడంతో ప్రీ రాడికల్స్ తో పోరాడటానికి మరియు జీవక్రియను పెంచడానికి దోహదం చేస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+