చలికి మీ చర్మం దారుణంగా తయారైందా.. అయితే ఇలా చెయ్యండి!
ప్రస్తుతం చలి తీవ్రత పెరిగింది. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఉష్ణోగ్రత తగ్గడం వలన చల్లని మరియు పొడి గాలుల కారణంగా చర్మం పొడిబారిపోతుంది. కొంతమందికి చర్మం పగిలినట్టుగా మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చలికాలం కారణంగా మనం సహజంగా నీళ్లు కూడా తక్కువ తాగుతాం అయితే ఇది చర్మ సమస్యలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
చలికాలం చర్మ ఆరోగ్యం జాగ్రత్త
చలికాలం తగినంత నీటిని తాగడం, చర్మాన్ని కాపాడుకోవడానికి మాయిశ్చరైజర్లు ఉపయోగించటం మంచిదని సిఫార్సు చేస్తున్నారు. అదనంగా చలి నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి ఈ సీజన్ కి తగ్గట్టు బట్టలు కూడా వేసుకోవాలని చెబుతున్నారు.చలికాలం చల్లటి గాలులలో తేమ ఉండని కారణంగా ఇది మన చర్మం యొక్క సహజ నూనెను కోల్పోయేలా చేస్తుంది అంతేకాదు దురదలకు అసౌకర్యానికి దారితీస్తుంది.

చలికాలం ఇలా చేస్తున్నారా?
అయితే చలికాలం చర్మాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డెర్మటాలజిస్ట్ లు సూచిస్తున్నారు. ముఖ్యంగా చలికాలం సలసల మసలే నీటితో స్నానం చేయడం మంచిది కాదని అలవాటు ఉంటే మార్చుకోవాలని చెపుతున్నారు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే మంచిదని సూచిస్తున్నారు.చలి తట్టుకోలేక ఇంట్లో హీటర్స్ పెట్టుకొని కూర్చునే వాళ్ళు చర్మం మరింత పొడిదనాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
చర్మ ఆరోగ్యం కోసం వైద్యుల సలహాలు
గాలిలో తేమను పెంచే హ్యూమిడిఫైయర్‌లను ఉపయోగించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇది చర్మ హైడ్రేషన్‌ను నిర్వహించడంలో దోహదం చేస్తుంది అంటున్నారు. చలికాలంలో పెదవులు పగలకుండా లిప్ బామ్‌లను క్రమం తప్పకుండా ఉపయోగించడం కూడా మంచిదని సూచిస్తున్నారు. ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారు డెర్మటాలజిస్ట్ ను సంప్రదించటం మంచిదని సూచిస్తున్నారు. అంతేకాదు మెరుగైన హైడ్రేషన్ కోసం వైద్యులు సిఫార్సు చేసే క్రీములను ఉపయోగించాలని సూచిస్తున్నారు.
చర్మ ఆరోగ్యానికి వీటితో మద్దతు
ఇక ఈ చలికాలంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చర్మ ఆరోగ్యానికి మద్దతునిస్తుందని చెబుతున్నారు. చేపలు, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలని ప్రతిరోజు తగినంత నీటిని తాగాలని సలహా ఇస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications