వారంలో మూడు కేజీల బరువు తగ్గించే ఎగ్ డైట్ ప్లాన్.. మొదలెడదామా!

చాలామంది ప్రతిరోజు గుడ్లు తినాలని భావిస్తారు. ప్రతిరోజు గుడ్డు తినడం మంచి పౌష్టికాహారం అని ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాయి. కొంతమంది గుడ్లను ఉడకబెట్టుకుని తింటే, మరి కొంతమంది కూరల రూపంలో, ఇంకొంతమంది ఆమ్లెట్ రూపంలో గుడ్డును వండుకొని తింటూ ఉంటారు. అయితే గుడ్లు తినడం మంచిదే అయినప్పటికీ వాటిని ఏ సమయంలో తినాలి? ఏ విధానంలో తినాలి? అనేది తెలిసి ఉండాలి.

వారంరోజుల ఎగ్ డైట్ ప్లాన్
గుడ్లు ముఖ్యంగా మన శరీరానికి కావలసిన ప్రోటీన్ ను అందిస్తాయి. మన శరీరానికి ప్రోటీన్ అందించి మన ఆరోగ్యానికి దోహదం చేసే, బరువును తగ్గించే గుడ్లను మనం డైట్ ప్లాన్ లో కూడా ఎంచుకోవచ్చు. ఒక వారం రోజులపాటు ఎగ్ డైట్ ప్లాన్ చేసినట్లయితే మన ఆరోగ్యం లో చాలా మార్పులు కనిపిస్తాయని పలువురు న్యూట్రీషియన్లు చెబుతున్నారు. మరి వారం రోజులపాటు చేయదగిన ఎగ్ డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం.

Egg diet plan to lose three kg in a week Let s get started

వారం రోజుల బ్రేక్ ఫాస్ట్ ఇలా
వారం రోజులపాటు మనం తీసుకునే ఎగ్ డైట్ ప్లాన్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు తక్కువగా మనం తీసుకుంటాం. దీనివల్ల ఏడురోజుల్లో రెండు నుంచి మూడు కిలోల వరకు తగ్గవచ్చు. దీనికోసం ఉదయం 7గంటల నుండి 9గంటలలోపు బ్రేక్ ఫాస్ట్ గా రెండు ఉడికించిన గుడ్లను తినాలి. ఒక కప్పు గ్రీన్ టీ లేదా నిమ్మరసాన్ని తీసుకోవాలి. ఏదైనా ఒక పండును తినాలి. దీంతో బ్రేక్ ఫాస్ట్ పూర్తవుతుంది.

లంచ్ ప్లాన్ ఇలా
ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట నుండి రెండు గంటల సమయంలో ఉడికించిన గుడ్డు లేదా రెండు ఎగ్ వైట్ లను తీసుకోవాలి. ఒక కప్పు వెజిటబుల్ సలాడ్ ఒక చిన్న బౌల్ బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్ రైస్ లేదా పప్పు సూప్ ను తీసుకోవాలి. దీంతో భోజనం పూర్తవుతుంది.

సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం ఇలా
సాయంత్రం 5గంటల నుండి 6గంటలకు ఒక కప్పు గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీని ఐదు బాదం పప్పులు లేదా ఒక ఉడికించిన గుడ్డును తీసుకోవాలి. దీంతో సాయంత్రం స్నాక్స్ పూర్తవుతుంది. ఆపై రాత్రి 8గంటల లోపు రెండు ఎగ్ వైట్ లను, ఉడకపెట్టి గాని లేదా హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ గా వేసుకుని కానీ తినాలి. ఒక బౌల్ వెజిటబుల్ సూప్ తోపాటు లైట్ గా ఆహారం తీసుకోవాలి.

డైట్ తో పాటు ఇవి చేస్తే బెస్ట్ రిజల్ట్స్
ఇలా చేయడంతో పాటు ప్రతిరోజు మూడు నుంచి మూడున్నర లీటర్ల నీళ్లు తాగాలి. 30 నుంచి 45 నిమిషాల పాటు నడవాలి. కాస్తో కూస్తో వ్యాయామం చేయాలి. స్వీట్స్, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి. అయితే ఈ డైట్ చేస్తున్నవారు డైట్ చేస్తున్న క్రమంలో ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే డైట్ ఆపివేయాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+