చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసే ఆహారాలు!
ప్రస్తుతం చాలామంది కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. శరీరంలో ఎన్డీఎల్ కొలెస్ట్రాల్ ను చెడు కొలెస్ట్రాల్ గా చెబుతారు. ఇది మన రక్తనాళాలలో కొవ్వు నిల్వలను పెంచుతుంది. రక్తప్రసరణను నిరోధిస్తుంది. గుండెపోటుకు కారణం అవుతుంది. హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను మంచి కొలెస్ట్రాల్ గా చెబుతారు. అయితే మన శరీరంలో ప్రస్తుతం ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది.
చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసే ఆహారాలు
ఈ కొలెస్ట్రాల్ మనకు అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది. చాలామందికి గుండెపోటు రావడానికి ఇది కారణమవుతుంది. మనం నిజ జీవితంలో తీసుకునే ఆహరంతో ఈ కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయవచ్చు .కొన్ని రకాల ఆహార పదార్థాలు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ప్రస్తుతం మనం వాటి గురించి తెలుసుకుందాం.

ఓట్స్ మరియు బార్లీ గింజలు
ఓట్స్ మరియు బార్లీ గింజలు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ఓట్స్ మరియు బార్లీ గింజలలో బీటా గ్లూకాన్ అని ఒకరకమైన కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.
కూరగాయలు, పండ్లతో చెడు కొలెస్ట్రాల్ కు చెక్
కూరగాయలు, ఆకు కూరలు, మరియు పండ్లలో కూడా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే బోలెడు పోషకాలు ఉంటాయి కూరగాయలు పండ్లను తింటే గుండెజబ్బులు స్ట్రోక్స్ కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి వీటిల్లో కూడా కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.
చిక్కుళ్ళు, బీన్స్, నట్స్ తో చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్
చిక్కుళ్ళు, బీన్స్ కూడా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. చిక్కుళ్ళు, బీన్స్ లో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి మన శరీరంలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే నట్స్ ఎంతో గానే ఉపయోగపడతాయి. నట్స్ ను క్రమం తప్పకుండా తినడం వల్ల మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
సోయా ఉత్పత్తులతోనూ చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్
ఇక సోయా ఉత్పత్తులలో కూడా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను, ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గించే బోలెడు పోషకాలు ఉంటాయి. కనుక వీటిని మనం ఆహారంలో భాగంగా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ ను కొంతమేరకు తగ్గించవచ్చు. మొత్తంగా చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ కోసం ఈ ఆహారాలు తినండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications