Poppy seeds: ఈ చిన్నగింజలు చేసే మాయతో ఒత్తిడి మాయం, సుఖ నిద్ర ఖాయం!
చాలామంది మానసిక ఒత్తిడితో, నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి మన ఇంట్లోనే ఉండే ఒక మసాలా దినుసు మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇది సుఖ నిద్రను కూడా ఇస్తుంది. మరి అటువంటి మసాలా దినుసు ఏమిటి? అది కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
గసగసాలతో ఆరోగ్యం
గసగసాలు చాలామంది ఇళ్లల్లో వంటలో తప్పనిసరిగా దీన్ని ఉపయోగిస్తారు. గసగసాలు మనసును ప్రశాంతంగా ఉంచే గుణాలకు చాలా పేరొందాయి. అందుకే చాలామంది మంచి నిద్ర కోసం, లేదా ఒత్తిడి తగ్గించుకోవడానికి వీటిని సహజ పద్ధతిగా ఎంచుకుంటారు. ఈ చిన్న గింజల్లో మన శరీరం, మనసు ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడే పోషకాలు ఉంటాయి. సహజ పద్ధతులను ఇష్టపడేవారికి ఇవి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి.

గసగసాలలో ఉండే పోషకాలతో ఆరోగ్యం
గసగసాలలో మెగ్నీషియం బాగా ఉంటుంది. ఇది మెదడులోని రసాయనాలను సరిగ్గా పనిచేయిస్తుంది. ఈ మినరల్ నరాలు సరిగ్గా పని చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు, మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. వీటిలో కాల్షియం, జింక్ కూడా ఉంటాయి. ఇవి మన పూర్తి ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ గింజల్లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరానికి జరిగే నష్టాన్ని తగ్గించి, వాపును తగ్గిస్తాయి. అంతేకాకుండా, శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి.
గసగసాలను ఆహారంలో ఇలా తీసుకోండి
ఈ పోషకాలు ఉండటం వల్ల, సహజంగా ఒత్తిడి తగ్గించుకోవాలనుకునే వారికి గసగసాలు చాలా మంచి ఎంపికగా చెప్పవచ్చు. గసగసాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా తేలిక. మనం వండే కూరల్లోనూ గసగసాలను వినియోగించుకోవచ్చు. చాలామంది నాన్ వెజ్ కూరలలో గసగసాలను పేస్టులా చేసి వాడతారు. వీటిని బ్రెడ్, కేకుల్లో వేసుకోవచ్చు, సలాడ్లపై చల్లుకోవచ్చు లేదా స్మూతీల్లో కలుపుకోవచ్చు.
గసగసాలు ఎక్కువ తీసుకోవటం మంచిది కాదు
కొంతమంది వీటిని వేడి నీటిలో నానబెట్టి టీ లాగా తాగడం ఇష్టపడతారు. ఇలా చేయడం వల్ల వాటిలోని మంచి పోషకాలు శరీరానికి త్వరగా అందుతాయి. గసగసాలు ఆరోగ్యానికి మంచివే అయినా, వాటిని తక్కువ మోతాదులో వాడటం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఎక్కువ మోతాదులో తీసుకుంటే, వాటిలోని ఓపియేట్ లక్షణాల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
నిద్రకు బెస్ట్ మెడిసిన్
మీ ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలనుకున్నా, ముందుగా డాక్టర్ లేదా ఆరోగ్య నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది. నిద్ర సరిగా పట్టని వారికి, ఒత్తిడి తగ్గించుకోవాలనుకునే వారికి గసగసాలు ఒక మంచి సహజ మార్గం. వాటిలో ఉండే పోషకాలు శరీరం రిలాక్స్ అవ్వడానికి, ఆరోగ్యం మెరుగుపడటానికి సహాయపడతాయి. మీ రోజువారీ ఆహారంలో పరిమిత మోతాదులో ఈ గింజలను చేర్చుకుంటే, మీకు మంచి నిద్ర పట్టవచ్చు, ఒత్తిడి కూడా తగ్గుతుంది.












Click it and Unblock the Notifications