Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Health tips: కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు చికెన్ తినొచ్చా?

చాలామంది కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. కల్తీ ఎక్కువగా ఉన్న నూనెల వాడకం, వంటల్లో నూనెల అధిక వినియోగం, శారీరక శ్రమ లేకపోవడం, బయట జంక్ ఫుడ్ కు అలవాటు పడడం, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వంటి అనేక ఆహారపు అలవాట్లు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతున్నాయి.

ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోను కొలెస్ట్రాల్ సమస్య అన్నది తీవ్ర సమస్యగా పరిణమిస్తోంది. అయితే చాలామంది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే చికెన్, మటన్ వంటి నాన్వెజ్ తినకూడదు అని చెబుతూ ఉంటారు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే చికెన్ తినొచ్చా? తినకూడదా? అన్నది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Health tips: Can people with cholesterol problems eat chicken?

భారతదేశంలో శాఖాహారుల కంటే మాంసాహారులు ఎక్కువమంది ఉన్నారు. ముఖ్యంగా చికెన్ ఎక్కువగా తినే వారు చాలా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. భారతదేశంలో 78 శాతం స్త్రీలు, 70 శాతం పురుషులు మాంసాహారాన్ని ఇష్టంగా తింటారు. అయితే అలాంటి వారు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటే మాంసాహారాన్ని తినొచ్చా? ముఖ్యంగా చికెన్ తినొచ్చా? అన్నది వారికి వచ్చే అనుమానం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం మాంసం తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అయితే చికెన్ విషయంలో చికెన్ ఉడికించే దాన్నిబట్టి అది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా చికెన్ ను చాలా ఎక్కువ నూనెలో వండితే అది కొలెస్ట్రాల్ ను బాగా పెంచుతుంది. ఇక చికెన్ ను ఇష్టంగా తినేవారు చికెన్ ఫ్రై, కడాయి చికెన్, చికెన్ డీప్ ఫ్రై, బటర్ చికెన్ వంటి వాటిని తింటే కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది.

ఇక బ్లడ్ లో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలి అంటే వండుకొని తినే విధానమే మెయిన్ అంటున్నారు. చికెన్ సూప్ చేసుకున్న నూనె లేకుండా చికెన్ ను ఉడకబెట్టుకుని తిన్న లేదా తక్కువ నూనెతో తయారుచేసిన తందూరి చికెన్, బొగ్గుపై కాల్చిన బార్బిక్యూ చికెన్ వంటివి తిన్నా ఆరోగ్యానికి హాని కలుగదు. ఎంత చికెన్ పై ఇష్టం ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, ఇంకా కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు వారానికి ఒకసారి మాత్రమే చికెన్ తినాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+