health tips: విపరీతమైన కోపంతో ఈ వ్యాధుల ప్రమాదం.. తస్మాత్ జాగ్రత్త!!
తన కోపమే తన శత్రువు అంటారు.. ఇది అక్షర సత్యం. విపరీతమైన కోపంతో ఉండేవాళ్ళు అనేక నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా కోపం కారణంగా ఆరోగ్య నష్టం జరుగుతుంది అనేక తీవ్రమైన వారిని వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. చాలామంది ప్రతి చిన్న విషయానికి విపరీతంగా కోప్పడుతూ ఉంటారు. అలా తరచూ కోపంతో ఇబ్బంది పడుతున్న వారు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
కాబట్టి కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. మారుతున్న జీవనశైలితో యువతలో ఒత్తిడి, ఆందోళన తో పాటు కోపం వంటి సమస్యలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. కోపం మానసిక, శారీరక మరియు సామాజిక జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.కోపం మనం ఊహించని ఆనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. కోపం కారణంగా హార్మోనల్ సమస్యలు వస్తాయి.

కోపం కారణంగా కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు పెరుగుతాయి. కోపంగా ఉన్న సమయంలో మన మెదడులోని రక్తనాళాలు సంకోచిస్తాయి. ఇలాంటి పరిస్థితులలో కోపం ఒక్కొక్కసారి రక్తనాళాలు దెబ్బ తినేలా చేస్తుంది. విపరీతమైన కోపం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దాని కారణంగా అనేక ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
కోపం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మితిమీరిన కోపం తెచ్చుకోవడం ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా మారుతుంది. కోపం వల్ల తలనొప్పి, అధిక రక్తపోటు, నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. కోపం కారణంగా కుటుంబ సబంధాలలోనూ ఇబ్బందులు వస్తాయి. ఇది మానసిక సమస్యలకు కారణం అవుతుంది.
ఒక్కొక్కసారి విపరీతమైన కోపం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వంటి సమస్యల ముప్పు పెరుగుతుంది. చాలా కోపంగా ఉండే వ్యక్తుల్లో కూడా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు చర్మ సంబంధిత సమస్యలు సోరియాసిస్, ఎగ్జిమా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకుంటే అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. మితిమీరిన కోపం ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం చాలా అవసరం.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications