health tips: చేపలతో పాటు ఈ ఆహారాలు పొరబాటున కూడా తినొద్దు!!
మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారపదార్థాలలో చేపలను ఒకటిగా చెబుతారు. చేపలలో ఉండే ప్రోటీన్, ఐరన్, విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ముఖ్యమైన పోషకాలు మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక మనం తినే ఆహారంలో చేపలను భాగం చేసుకుంటే మంచిదని చెబుతారు.
చేపలు తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. మెదడు ఆరోగ్యం పెరుగుతుంది. జుట్టు కూడా దృఢంగా ఉంటుంది. అయితే చేపలతో పాటు కొన్ని ఆహార పదార్థాలను తినకూడదని, చేపలు తిన్నప్పుడు లేదా తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తినడం ఆరోగ్యానికి చాలా హానిని కలిగిస్తుందని చెబుతున్నారు. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

చేపలతో పాటు ఐస్ క్రీమ్ అసలే తినకూడదు. అలా తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతాయని అనేక పరిశోధనలు, అధ్యయనాలలో తేలింది. కాబట్టి చేపలు తినే రోజు ఐస్ క్రీమ్ తినడం మానేయండి. ఇక చేపలతో పాటు పెరుగును తినకూడదు.
చేపలు మరియు పెరుగును కలిపి తినడం ప్రమాదకరమైందిగా పరిగణించబడుతుంది. దీనివల్ల స్కిన్ ఎలర్జీలు ప్రమాదం ఉంటుంది. ఒకవేళ స్కిన్ ఎలర్జీ ఉన్నవారికి ఆ సమస్య మరింత తీవ్రతరంగా మారుతుంది. చేపలతో పాటు పాలు పొరపాటున కూడా తాగకూడదు. చేపల కూర తిన రోజు పాలు తాగడం వల్ల జీర్ణశక్తి చెడిపోయి, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అంతేకాదు చర్మ సమస్యలు కూడా పెరుగుతాయి.
చేపలు తిన్న రోజు సిట్రస్ ఎక్కువగా ఉండే ఫలాలను తినకూడదు. నారింజ, బత్తాయి, కమలాలు వంటి పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్య తలెత్తుతుంది. ఫలితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక చేపల కూర తిన్న రోజు చేపలతో పాటు కాఫీని కానీ, టీని కానీ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరంగా చెప్పబడింది.
చేపలు తిన్నప్పుడు పాలతో చేసిన స్వీట్లు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరం అని చెప్పబడింది. ముఖ్యంగా చేపలు తిన్న తర్వాత పాలు, పాల పదార్థాలు తీసుకుంటే చర్మ సమస్యలు వస్తాయి అన్నది ప్రధాన కారణం. అందుకే చేపలు తిన్న తర్వాత వీటిని కచ్చితంగా తినకుండా ఉండాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications