health tips: చలికాలంలో ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే ఈ జ్యూస్ లు తాగాలి!!

చలికాలం మన ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. చలికాలం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా చలికాలం తీసుకోవలసిన ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చలికాలంలో తాగే పానీయాల విషయంలో జాగ్రత్త పాటించాలి. చలికాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫిట్ గా ఉండడానికి కొన్ని జ్యూస్ లు ఎంతో మేలు చేస్తాయి.

ముఖ్యంగా ఏడు రకాలు జ్యూస్ లు చలికాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ప్రస్తుతం మనం అవేమిటో తెలుసుకుందాం. చలికాలంలో బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది మన శరీరంలో రక్తం మొత్తాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఆక్సిడెంట్ రవాణాను వేగవంతం చేస్తుంది.

health tips: Drink these juices to stay healthy and fit in winter!!

చలికాలంలో ఉసిరికాయ రసం తాగడం కూడా ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చలికాలంలో రోజు క్యారెట్ జ్యూస్ తాగితే మంచిదని చెబుతున్నారు. క్యారెట్ జ్యూస్ లో ఉండే పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రభావంతంగా పనిచేస్తాయి.

ఇక చలికాలంలో పాలకూర జ్యూస్ తాగితే మంచిదని, ఇది ఆరోగ్యాన్ని పెంచుతుందని చెబుతున్నారు. పాలకూర జ్యూస్ తోటి కూడా శరీరంలో రక్తం పెరగడమే కాకుండా, వ్యాధులతో పోరాడే శక్తి కూడా పెరుగుతుంది. చలికాలంలో పరిమిత పరిమాణంలో విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ రసాన్ని కూడా తీసుకోవచ్చని చెబుతున్నారు.

అంతేకాకుండా విటమిన్ సి అధికంగా ఉండే టమాటా జ్యూస్ కూడా శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని ఇందులో మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు తగినంత పరిణామంలో ఉంటాయని చెబుతున్నారు. చలికాలంలో దానిమ్మ రసం తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. దానిమ్మ రసం తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరిగి శరీరానికి బలం చేకూరుతుంది.కాబట్టి చలికాలంలో ఏమైనా తాగాలి అనుకుంటే ఆరోగ్యంగా , ఫిట్ గా ఉంచే ఈ పానీయాలను తాగాల్సిన అవసరం ఉంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+