health tips: విరేచనాలకు చెక్ పెట్టే నేచురల్ టిప్స్!!
సహజంగా ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్త వహించకపోతే ఒక్కోసారి తీసుకున్న ఆహారం జీర్ణం కాక విరేచనాలు మొదలవుతాయి. ముఖ్యంగా ఎండాకాలంలో సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. ఒకవేళ అలా కాకుంటే కడుపు గందరగోళానికి గురై మోషన్స్ బారిన పడతారు. ఎండాకాలం లో మోషన్స్ అయితే శరీరం డిహైడ్రేట్ అవుతుంది కాబట్టి ఎండాకాలంలో విరేచనాలు తగ్గడం కోసం కొన్ని న్యాచురల్ రెమెడీస్ ని ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
చాలామంది విరేచనాలు అవుతుంటే టాబ్లెట్లు వేసుకుంటారు. అయితే సహజమైన పద్ధతులతో కూడా విరేచనాలకు చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బాగా విరేచనాలు అవుతూ, శరీరం డిహైడ్రేడ్ అవుతుంటే ఎక్కువగా నీటిని తాగాలి. కొబ్బరినీళ్లు ఓ ఆర్ ఎస్ ఎల్ వంటివి తాగితే శరీరం నీరసించకుండా ఉంటుంది.

ఇక సహజమైన పద్ధతుల ద్వారా మోషన్స్ కు చెక్ పెట్టాలంటే ఒక గిన్నెలో నీటిని తీసుకొని అందులో అర స్పూను తురిమిన అల్లం, ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి ఈ ద్రావణాన్ని బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత ఈ ద్రావణాన్ని తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. అంతేకాదు అరటి పండు కూడా విరేచనాలను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది.
అరటిపండును విడిగా తిన్నా విరేచనాలు తగ్గుతాయి. పెరుగన్నం లో అరటి పండు కలుపుకుని తింటే కూడా విరేచనాలు కంట్రోల్ అవుతాయి. తేనే మరియు దాల్చిన చెక్క మిశ్రమం కూడా లూజ్ మోషన్స్ ను కంట్రోల్ చేస్తుంది. విరోచనాలు ఎంతకీ తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటే గడ్డపెరుగును తింటే కూడా విరేచనాలకు అడ్డుకట్టపడుతుంది.కొబ్బరినీళ్ళు కూడా మోషన్స్ ను తగ్గిస్తుంది.
ఇక గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు కలుపుకొని తాగినా విరోచనాలకు చెక్ పడుతుంది. మెంతులు కూడా విరేచానాలను తగ్గిస్తాయని చెప్తారు. మజ్జిగ అన్నిటికంటే ఎక్కువగా మన జీర్ణ వ్యవస్థను బాగు చేస్తుంది. మజ్జిగ బాగా తీసుకుంటే విరేచనాలకు అడ్డుకట్ట పడటంతో పాటు గట్ హెల్త్ బాగుంటుంది. అయితే పుల్లటి మజ్జిగను మాత్రం తాగకుండా ఉంటేనే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ఉపాసన చెప్పిన సింపుల్ స్పెషల్ రాగి జావ.. ఇలా చేస్తే బలం! -
టేస్టీ టేస్టీ "బెండకాయ మటన్ కర్రీ" ఎలా చేయాలంటే..? -
టీలో చక్కెరకు బదులు ఇవి వాడి చూడండి: అస్సలు వదలరు -
పొట్టు మినపప్పుతో రోటిపచ్చడి.. తింటే అసలే వదిలిపెట్టరు! -
ఎండాకాలం చన్నీళ్ళ స్నానం చేస్తున్నారా? -
"మిల్ మేకర్ బ్రెడ్ ఆమ్లెట్" ఇలా చేస్తే ముక్క కూడా వదలరు !! -
దయచేసి నడవండి.. రోజుకు 7000 అడుగులేయండి.. -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?












Click it and Unblock the Notifications