Health tips: నిద్ర పోయేటప్పుడు కూడా ఫోన్ తలపక్కనేనా? ఎంత ప్రమాదమో తెలిస్తే నిద్రపోరు!!
ప్రస్తుత స్పీడ్ ప్రపంచంలో చేతిలో ఫోన్ లేకపోతే క్షణం కూడా గడవదు. స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక భాగంగా మారిపోయింది. ఉదయం నిద్ర లేచిన దగ్గరనుంచి నిద్రపోయే వరకు, కొందరైతే అర్ధరాత్రి వరకు ఫోన్ లోనే గడుపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లకు బానిసలుగా మారిపోయారు.
మనుషులతో మాట్లాడటం మానేసి ఫోన్లతో గడపటం అలవాటు చేసుకున్నారు. ఒక్క గంట సేపు ఫోన్ పని చెయ్యలేదు అంటే విలవిలలాడుతున్నారు. కొందరైతే నిద్రపోయే సమయంలో కూడా తల పక్కనే ఫోన్ పెట్టుకొని నిద్రిస్తున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదని, దాని వల్ల అనర్ధాలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్యులు.

అసలు రాత్రిపూట సెల్ ఫోన్ వాడటమే రోగాలను కొనితెచ్చుకున్నట్లు అని చెబుతున్నారు. ఇక సెల్ ఫోన్ తల పక్కన బెడ్ పై పెట్టుకొని పడుకునే వారికి సెల్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. బెడ్ రూమ్లో ఫోన్ ను బెడ్ కు చాలా దూరంగా పెట్టుకోవాలి అని సూచిస్తున్నారు.
సెల్ ఫోన్ లను బెడ్ పైన పెట్టుకొని పడుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయని, నిద్ర రావడానికి ఉపకరించే మెదడులోని హార్మోన్ల ఉత్పత్తి స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉంటే తగ్గుతుందని చెబుతున్నారు. సరిగ్గా నిద్రపోకపోవడం అనేక అనారోగ్యాలకు మూలంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

నిద్ర సరిగా లేకపోతే చేసే పనిలో కూడా ఉత్సాహం ఉండదని, ఊరికే చిరాకుగా ఉంటుందని చెబుతున్నారు. పని మీద కూడా శ్రద్ధ పెట్టలేరని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తరచూ తలనొప్పి రావడం, అధికంగా బరువు పెరగడం, డయాబెటిస్, హై బీపీ, జీర్ణకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లను బెడ్ మీద పెట్టుకుని పడుకునే అలవాటు మానుకోకపోతే ఖచ్చితంగా ఆసుపత్రి బెడ్ ఎక్కాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications