health tips: కీళ్ళవాతమా.. అయితే ఆహారంలో ఈ జాగ్రత్తలు పాటించండి!!

మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. జీర్ణ వ్యవస్థ దెబ్బతినడంతో కీళ్ల నొప్పులు వస్తాయి. అయితే ప్రస్తుతం చాలామంది కీళ్ళ వాతంతో బాధ పడుతున్నారు. కూర్చుంటే లేవలేక, లేచినా నడవలేక ఇబ్బంది పడుతున్నారు. కీళ్ళ వాతంతో బాధపడే వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఏం తినొచ్చు? ఏం తినకూడదు? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఆకుకూరలు ఎక్కువగా తినాలి. మాంసాహారం చాలా తక్కువగా తినాలి. పులుపులేని ఆకుకూరలు, కూరగాయలు ఏవైనా తినొచ్చు. ఆకుకూరలు ఎముకలకు బలాన్నిచ్చే పొటాషియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆకు కూరలు తింటే కొంత కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

foodprecautonsforkneespain

కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళు శెనగపిండి, మైదా పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. ఇవి ఆలస్యంగా జీర్ణమవుతూ శరీరంపై ప్రభావం చూపిస్తాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ముల్లంగి, క్యారెట్, క్యాలీఫ్లవర్ లను ఎక్కువ తినాలి. ఇవి కీళ్లనొప్పులను తగ్గిస్తాయి. ఇక బీరకాయ, పొట్లకాయ, దోసకాయ, గుమ్మడికాయ వంటి కూరగాయలను తినొచ్చు.

కీళ్ల నొప్పులతో ఇబ్బందిపడేవారు ఆలు గడ్డలు, చేమ గడ్డలు, కంద, చిలగడదుంప లాంటి దుంప కూరలు ఏవి తినకూడదు. ఇవి నొప్పులను మరింత పెంచి అనవసరమైన తిప్పలు తీసుకు వస్తాయి. ఇక మాంసాహారం కీళ్లవాతాన్ని మరింత పెంచుతుంది. మాంసాహారాన్ని తక్కువగా తీసుకుంటే కాస్త కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

కీళ్ళ నొప్పులు తగ్గాలంటే పొటాషియం ఎక్కువగా ఉండే పండ్లు తినాలి. అరటిపండ్లు, పైనాపిల్, నారింజ తినాలి. కీళ్లనొప్పులు తగ్గించుకోవాలి అనుకుంటే ఆవు నెయ్యి, ఆవు మజ్జిగను ఎక్కువగా తీసుకోవాలి. పాలు, పెరుగు వంటి వాటిని ఆహారంలో తీసుకోవడం తగ్గించాలి. వేప పూతను ఎండబెట్టి, నెయ్యిలో వేయించి అందులో కాస్త ఉప్పు, కారం వేసి దంచి నిల్వచేసుకొని ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవాలి. అప్పుడు కీళ్ళనొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+