health tips: ఈ కూరగాయలు, పండ్లతో బరువు పెరుగుతారు.. జాగ్రత్త!!
చాలామంది విపరీతంగా బరువు పెరుగుతున్నామని తెగ బాధపడుతూ ఉంటారు. అయితే బరువు పెరుగుతున్న వారు తాము ఎటువంటి ఆహారం తీసుకుంటున్నామో అసలు గుర్తించరు. బరువు తగ్గటం కోసం ఏవేవో చేస్తారు కానీ ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్త వహించరు. మనం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలు మనకు తెలియకుండానే మన బరువును విపరీతంగా పెంచుతాయి. బరువు తక్కువ వున్నవారికి ఓకే, కానీ బరువు ఎక్కువ ఉన్నవారు మాత్రం జాగ్రత్త పడాలి.
కొన్ని రకాల కూరగాయలు, పండ్లు బరువు పెరగడానికి బాగా దోహదం చేస్తాయి. అందుకే మనం తీసుకునే కూరగాయల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.కూరగాయలు తినడం వల్ల కావలసిన పోషకాలు లభిస్తాయి అన్న మాట వాస్తవమే అయినప్పటికీ కొన్ని కూరగాయలు రెగ్యులర్ గా తింటే బరువు విపరీతంగా పెరుగుతారు. బంగాళదుంపలు, మొక్కజొన్నలు, పిండి పదార్థం ఎక్కువగా ఉండే బీన్స్ వంటివి తింటే బరువు విపరీతంగా పెరుగుతారు.

అరటికాయలు, మామిడి వంటివి తినడం వల్ల కూడా బరువు విపరీతంగా పెరుగుతారు. ఎక్కువ బరువు పెరగడం ఊబకాయానికి, మధుమేహం, గుండె జబ్బులకు కారణమవుతుంది. ముఖ్యంగా బంగాళాదుంపలు బరువును విపరీతంగా పెంచి శరీరానికి హాని చేస్తాయి. కీళ్లవాతం, డయాబెటిస్ సమస్య ఉన్నవారు బంగాళదుంపలు తినకుండా ఉంటేనే మంచిది.
బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, మరియు విటమిన్ సి, విటమిన్ ఓ, పుష్కలంగా ఉంటాయి. అయితే బంగాళదుంపల లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల అవి బరువును బాగా పెంచుతాయి. పండిన మామిడి, పైనాపిల్ కూడా బరువును బాగా పెంచుతాయి. అరటిపండ్లు కూడా బరువును పెంచుతాయి.
అందుకే మనం తీసుకునే ఆహారంలో, తినే కూరగాయలు, పండ్ల విషయంలో అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఏ ఆహారమైన బరువును పెంచుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.ఇక సన్నగా ఉండి బరువు పెరగాలనుకునేవారు ఈ ఆహారాన్ని తీసుకోవచ్చు కానీ బరువు తగ్గాలి అని భావించేవారు ఈ ఆహారానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.
disclaimer: ఈ కథనం డైటీషియన్లు, వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications