health tips: ఈ పద్దతులతో ఖచ్చితంగా బరువు తగ్గి స్లిమ్ అవుతారు!!
ప్రస్తుత సమాజంలో ఊబకాయం అతిపెద్ద సమస్య. విపరీతంగా బరువు పెరిగి ఆ బరువు కారణంగా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే బరువును అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మళ్లీ బరువు తగ్గాలంటే చాలా సమయం పడుతుంది. టక్కున బరువు తగ్గాలంటే అది సాధ్యమయ్యే పని కాదు.
అయితే చాలామంది బరువు తగ్గడం కోసం విపరీతంగా వర్కౌట్స్ చేయడం, తిండి మానేయడం అంటే పనులు చేస్తూ ఉంటారు. అయితే అది ఏమాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు వైద్యులు. బరువు తగ్గాలంటే కొన్ని పద్ధతులు పాటించాలని, కొన్ని బ్యాడ్ హాబిట్స్ మార్చుకోవాలని చెబుతున్నారు. బరువు తగ్గడం కోసం నిరంతరాయంగా చేయవలసిన పనులను చేస్తూ, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే బరువు తగ్గి, ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది.

బరువు తగ్గాలనుకునేవారు ఏం చేయాలంటే.. ప్రతి రోజు నీటిని పుష్కలంగా తాగాలి. ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలి. తెల్లవారుజామునే నిద్ర లేవాలి. ఉదయం ఒక అరగంట పాటు వ్యాయామం చేయాలి . కాఫీలు, టీలు తాగడం మానుకోవాలి. పాల పదార్థాలు, స్వీట్లు, కేకులు, ఐస్ క్రీమ్స్, వంటివి తినడం పూర్తిగా మానేయాలి. కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు సాధ్యమైనంత ఎక్కువగా తినాలి. బయట ఆహారాలకు దూరంగా ఉండాలి.
ముఖ్యంగా జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఇంట్లో కూడా బాగా ఆయిల్ ఎక్కువ వేసిన ఫుడ్స్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ ను తినకూడదు. కార్బోహైడ్రేట్ ఉండే ఆహారం తినకుండా చూసుకోవాలి. ధూమపానం, మద్యపానం చేసే అలవాటు ఉన్నవారు తక్షణం బట్టి మానుకోవాలి. ఎంత పని ఉన్నప్పటికీ అల్పాహారాన్ని, మధ్యాహ్న భోజనాన్ని, రాత్రి డిన్నర్ ను తొందరగా పూర్తి చేసుకోవాలి.
ఆలస్యంగా తింటే కొవ్వు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆహారాన్ని పెద్ద మొత్తంలో ఒకేసారి తినకూడదు. రోజులో ఎక్కువసార్లు తిన్న పర్వాలేదు. కొంచెం కొంచెంగా ఆహారాన్ని తీసుకోవాలి. ఇక ఈ పద్ధతులను పాటిస్తే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. స్లిమ్ గా మారతారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications