యువతలో హైబీపీ... కంటి చూపు పోయే ప్రమాదం.. జాగ్రత్త

హైపర్‌టెన్షన్, ఇది ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం. జీవన శైలి విధానంతో భారతదేశంలో యువతలోనూ అధిక రక్తపోటు సమస్య పెరుగుతుంది. ఇది మూత్రపిండాలు, లివర్, గుండె వంటి అవయవాల పైనే కాకుండా కళ్ళ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అధిక రక్తపోటును పట్టించుకోకపోతే తీవ్రమైన కంటి సమస్యలకు దారితీస్తుంది.

హైపర్ టెన్షన్ కు కంటి సమస్యలకు లింక్

హైపర్‌టెన్షన్ కు మరియు దృష్టి సమస్యలకు మధ్య సంబంధం ఏమిటి? హైపర్ టెన్షన్ ఏ విధంగా కంటి సమస్యలకు సంబంధించి సైలెంట్ కిల్లర్ గా మారుతుంది అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.అధిక రక్తపోటు కళ్లలోని రక్తనాళాలను దెబ్బతీయవచ్చు. ఈ నష్టం హైపర్‌టెన్సివ్ రెటినోపతి వంటి పరిస్థితులకు దారితీస్తుంది. ఫలితంగా ఇది రెటినాను ప్రభావితం చేస్తుంది.

High blood pressure in young people risk of losing eyesight be careful

హైపర్ టెన్షన్ కు చికిత్స చేయకుంటే కంటిచూపు డేంజర్ లో

చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది దృష్టి కోల్పోవడం లేదా అంధత్వానికి దారితీస్తుంది. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే కంటిచూపు పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే హైపర్ టెన్షన్ ను ప్రారంభ దశలోనే గుర్తించి మందులు వాడడంతో పాటు, హైపర్ టెన్షన్ తో బాధపడేవారు కంటి పరీక్షలు అప్పుడప్పుడు చేయించుకోవలసిన అవసరం ఉంది.

యువతలో పెరుగుతున్న హైపర్ టెన్షన్ కేసులు

ప్రస్తుతం జీవనశైలిలో మార్పుల కారణంగా భారత యువతలో హైపర్‌టెన్షన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం మరియు ఒత్తిడి వంటి అంశాలు ఈ పెరుగుదలకు ముఖ్య కారణాలుగా మారుతున్నాయి. యువత జీవన శైలి పైన నిర్లక్ష్యం వహించి, హైపర్ టెన్షన్ సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా ఒక్కొక్కసారి ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు.

అధిక రక్తపోటుతో కంటికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం

అధిక రక్తపోటు రెటీనా లోని రక్తనాళాల పైన ఒత్తిడి పెంచి వాటిని దెబ్బతినేలా చేస్తాయి. రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు ఒక్కొక్కసారి రక్తస్రావం అవుతుంది. దీనివల్ల ఒక్కొక్కసారి కంటి తెల్ల భాగంలో రక్తపు మచ్చలు కనిపిస్తాయి. రెటీనా దెబ్బతినడం వల్ల దృష్టి మసకబారడం లేదా దృష్టిలోపం ఏర్పడుతుంది. అధిక రక్తపోటు కారణంగా ఒక్కొక్కసారి కంటికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది చూపును శాశ్వతంగా కోల్పోయేలా గా చేస్తుంది .

హైబీపీ విషయంలో జాగ్రత్త

అధిక రక్తపోటు కంటి సమస్యలను తీవ్రతరం చేసి చూపు మందగించడానికి కారణమవుతుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కంటి సమస్యల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. హైబీపీని కంట్రోల్ చేసుకోవాలి. సరైన జీవన శైలిని పాటించడంతో పాటుగా వైద్యులు సూచించిన మందులను వేసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+