ప్రతీ దానికి టెన్షన్ పడుతున్నారా? అయితే ఈ జబ్బులు గ్యారెంటీ

టెన్షన్.. ఇప్పుడు చాలామంది జీవితాల్లో దీనిని తగ్గించడం కష్టంగా మారిపోయింది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, విపరీతమైన పని ఒత్తిడి వెరసి టెన్షన్ అందరి జీవితాల్లోనూ భాగంగా మారింది. ఇక బాగా టెన్షన్ పడితే అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ టెన్షన్ ను తగ్గించుకోవాలని ప్రశాంతంగా బ్రతకడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.

టెన్షన్ తో హైబీపీ
టెన్షన్ తో చేయాల్సిన పనులు సరిగ్గా చేయకపోగా, అనవసరమైన రిస్కులు పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. బాగా టెన్షన్ పడితే హైబీపీ వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. హైబీపీ మన శరీరంలోని ధమనుల గోడల పైన ఒత్తిడిని పెంచి మనకు గుండెపోటు, మరియు మూత్రపిండాల వ్యాధులు రావడానికి కారణమవుతుందని అందుకే టెన్షన్ ను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

high bp diabetes heart attacks etc severe health issues with tension

టెన్షన్ తో గుండెజబ్బులు, మధుమేహం
టెన్షన్ ఎక్కువగా ఉన్నవారిలో గుండె పనితీరు దెబ్బతింటుంది. ఇది గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. బాగా టెన్షన్ పడే వారిలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన ఒత్తిడి ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించి, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెంచుతుంది. దీనివల్ల మధుమేహం బారిన పడే అవకాశం ఉంది.

టెన్షన్ తో జీర్ణ సమస్యలు, నిద్రలేమి
టెన్షన్ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీంతో అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విపరీతమైన టెన్షన్ తలనొప్పికి కూడా కారణమవుతుంది. టెన్షన్ కారణంగా నిద్ర స్థాయి కూడా తగ్గుతుంది. నిద్రలేమి సమస్య పెరుగుతుంది. ఫలితంగా శారీరక, మానసిక ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం పడుతుంది.

టెన్షన్ తో మానసిక, శారీరక సమస్యలు
ఇక ఎక్కువ కాలం పాటు టెన్షన్ పడుతూ ఉండడం ఒక రకమైన ఆందోళనకు, డిప్రెషన్ కు కారణమవుతుంది. మానసిక రుగ్మతలకు కారణంగా మారుతుంది. ఎన్నో అనర్ధాలు కలిగించే టెన్షన్ ను పక్కన పెట్టి ప్రశాంతంగా జీవించడం ఉత్తమం. ప్రశాంతంగా ఉన్న వారికి ఎటువంటి రోగాలు వచ్చే అవకాశం లేదు. అందుకీ టెన్షన్ తగ్గించుకోవటానికి యోగా, మెడిటేషన్ వంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+